Diabetes: మధుమేహం ఉన్నవారు ఉపవాసం చేస్తే మెరుగైన ఫలితాలు..

ఈ మధ్యకాలంలో మధుమేహంతో పాటు కొందరు ఉబకాయం బారిన పడుతున్నారు. అయితే మధుమేహం ఉన్నవారు నిర్ణీత కాలం ఉపవాసం చేస్తే బరువు తగ్గుతారని తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. అయితే దీన్ని పాటించేముందు డాక్టర్ సలహా తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.

Diabetes: డయాబెటిస్ బాధితుల్లో పెరుగుతున్న కొవిడ్‌యేతర మరణాలు
New Update

ఈరోజుల్లో చాలామంది మధుమేహం బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఒక్కసారి ఈ దీర్ఘకాలిక వ్యాధికి గురయ్యారంటే ఇక జీవితాంతం టాబ్లెట్లు వేసుకోవాల్సిందే. అయితే ఈ మధ్య ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వారికి ఊబకాయం కూడా తోడు వస్తోంది. ఇలా జరిగితే రక్తంలో గ్లూకోజ్‌ నియంత్రను దెబ్బతీస్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే షుగర్ ఉన్నవారు బరువు తగ్గించుకోవాలని ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంటారు.

కొత్త పద్ధతి గుర్తింపు

వాస్తవానికి బరువు తగ్గించుకోవాలంటే ఎక్కువగా వినియోగించే పద్ధతి ఏంటంటే తీసుకునే ఆహారంలో కేలరీలను తగ్గించుకోవాలి. కానీ చాలామంది దీన్ని పాటించేందుకు జంకుతుంటారు. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. చివరికి ఒక కొత్త పద్ధతిని గుర్తించారు. మధుమేహం, ఉబకాయం ఈ రెండూ ఉన్నవారని మూడు బృందాలుగా విభజించారు. ఇందులో ఒక బృందానికి నిర్ణీత కాల ఉపవాసం చేయాలని సూచించారు.

ఉపవాసం చేసివారిలో ఫలితం

అయితే వీళ్లు మధ్నాహ్నం నుంచి రాత్రి 8 గంటల లోపే ఆహారం తిన్నారు. ఇంకో బృందం ఆహారంలో 25 శాతం కేలరీలు తగ్గించుకోవాలని సూచించారు. ఇక ఇంకో బృందం ఎలాంటి ఆహార నియమాలు పాటించలేదు. చివరికి ఆరు నెలల తర్వాత ఈ మూడు బృందాల వారిని పరిశీలించారు. ఇందులో నిర్ణీత కాల ఉపవాసం పాటించినవారు 3.6 శాతం బరువు తగ్గారు. కేలరీలు తగ్గించుకున్నవారు అంతగా బరువు తగ్గలేదు. కానీ ఈ రెండు బృందాల్లో ఉన్నవారిలో గ్లూకోజు తగ్గింది.

బరువు తగ్గడానికి సంప్రదాయ ఆహార నియమాలు పాటించడంలో ఇబ్బంది పడుతున్న వాళ్లకి నిర్ణీతకాల ఉపవాసం ఎంతోవరకు మేలు చేస్తున్నట్లు ఈ అధ్యయనంలో స్పష్టంగా తేలింది. అయితే మధుమేహులు దీన్ని పాటించేముందు ఓసారి డాక్టర్‌ సలహా తీసుకోవడం తప్పనిసరని పరిశోధకులు చెబుతున్నారు.

#telugu-news #health-news #diabetes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe