Health Tips: సంతానలేమికి అదిరిపోయే చిట్కా.. తాజా పరిశోధనలో బయటపడ్డ కీలక విషయాలు..

సంతానలేమి సమస్యపై పరిశోధనలు జరిపిన అధ్యయనంలో కీలక విషయాలు బయటపడ్డాయి. బాదం, అక్రోట్ల వంటి గింజ పప్పులు (నట్స్) మగవారిలో వీర్యం నాణ్యత మెరుగుపరిచేందుకు..అలాగే సంతాన సామర్థ్యం పుంజుకునేందుకు తోడ్పడుతున్నాయని పరిశోధనల్లో తేలింది.

New Update
Health Tips: సంతానలేమికి అదిరిపోయే చిట్కా.. తాజా పరిశోధనలో బయటపడ్డ కీలక విషయాలు..

వివాహం జరిగిన తర్వాత దంపతులు తమకు సంతానం కావాలని కోరుకుంటారు. కొన్ని జంటలకు మాత్రం త్వరగా సంతానం కలుగుతుంది.. మరికొన్ని జంటలకు ఆలస్యంగా జరుగుతుంది. మరికొందరిలో అయితే జన్యూ లోపం వల్ల పిల్లలు పుట్టరు. పెళ్లైన రెండేళ్ల తర్వాత సంతానం లేని దంపతులు మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటారు. ప్రస్తుతం సంతానలేమి సమస్యలు పెరిగిపోతున్నాయి. దీనిపై పరిశోధనలు కూడా సాగుతున్నాయి. అయితే తాజాగా మోనాష్ యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాదం, అక్రోట్ల వంటి గింజ పప్పులు (నట్స్) మగవారిలో వీర్యం నాణ్యత మెరుగుపరిచేందుకు..అలాగే సంతాన సామర్థ్యం పుంజుకునేందుకు దోహదపడుతున్నాయని తెలింది. రోజుకు 60-75 గ్రాముల గింజపప్పులు తిన్నా మంచి ఫలితాలు కనిపిస్తుండటం విశేషం.

Also Read: గెలిచాక పార్టీలు మారితే తాట తీస్తాం.. కోదండరాం వార్నింగ్..

మొత్తం నాలుగు అధ్యయనాలను సమీక్షించి దీన్ని గుర్తించారు. ఆహారంలో మిగతా మార్పులు ఏమీ లేకున్నా కూడా కేవలం గింజపప్పులను జోడించుకున్నా సరిపోతుందని పరిశోధకులు అంటున్నారు. వీటిలో ఒమేగా-3 పాలీఅన్‌సాచ్యురేట్‌ కొవ్వులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, వృక్ష రసాయనాలు పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తోందని చెబుతున్నారు. అయితే చాలామంది గింజపప్పులు తింటే లావైపోతామని భావిస్తుంటారు. వాస్తవానికి నట్స్‌ తిననివారితో పోలిస్తే వీటిని రోజుకు ఒకట్రెండు గుప్పిళ్లు తినేవారు సన్నగా ఉంటున్నారని పరిశోధకులు అంటున్నారు. గింజపప్పులో మోనోఅన్‌సాచ్యురేటెడ్‌ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, శరీరం తయారుచేసుకోలేని పోషకాలూ ఉంటాయని చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయని వివరిస్తున్నారు. ఉప్పు, చక్కెర కలిపినవి కాకుండా పచ్చిగా ఉన్నవి లేదా వేయించిన గింజపప్పులు తింటే మంచిదని సూచిస్తున్నారు.

Also Read: తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్‌పై ఏపీలో జోరుగా బెట్టింగ్స్..

Advertisment
తాజా కథనాలు