Health Tips: బరువు తగ్గడానికి బ్రౌన్ రైస్ మంచిదా? వైట్ రైస్ మంచిదా?

బరువు తగ్గాలని ప్రయత్నించే వారు బ్రౌన్ రైస్‌ను ఎంచుకోవడం ఉత్తమం అని చెబుతున్నాయి పరిశోధనలు. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఫైబర్, విటమిన్లు బ్రౌన్ రైస్‌లో ఉంటాయని, ఇవి బరువు తగ్గడంలో సహాయపడుతాయని చెబుతున్నారు.

Health Tips: బరువు తగ్గడానికి బ్రౌన్ రైస్ మంచిదా? వైట్ రైస్ మంచిదా?
New Update

Brown Rice vs White Rice: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరి జీవనశైలిలో(Life Style) భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగానే ప్రస్తుతం చాలా మంది ప్రజలు.. ఊబకాయం, స్థూలకాయం, అధిక బరువు సమస్యతో సతమతం అవుతున్నారు. కరోనా(Corona) లాక్‌డౌన్ తర్వాత ఊబకాయం సమస్య మరింత పెరిగిపోయింది. ప్రజలు తమ బరువును తగ్గించుకుఉనేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఔట్ డోర్ వ్యాయామాలు చేస్తుంటే.. మరికొందరు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే.. తిండి తినడం తగ్గించి సన్నగా మారడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గేందుకు చాలా మంది బ్రౌన్ రైస్ వంటివి తింటుంటారు. అయితే, తినే రైస్ విషయంలో చాలా మందిలో అనేక సందేహాలు ఉన్నాయి. బరువు తగ్గే విషయంలో ఏ రైస్ మంచిది? అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు ఈ కథనంలో సమాధానం తెలుసుకుందాం.

వైట్ రైస్..

వైట్ రైస్‌ను వడ్లను పూర్తిగా మర పట్టడం వల్ల.. దానిపై ఉన్న పొట్టు అంతా తొలగిపోతుంది. ఆ బియ్యాన్ని పాలిష్ చేస్తారు. దాంతో పై పొర మొత్తం పోయి.. వైట్ రైస్ వస్తుంది. ఇందులో ఫైబర్ ఉండదు. ఈ బియ్యాన్నే దేశమంతా తింటున్నాం. ఇది ప్రపంచంలోని పురాతన ధాన్యాలలో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా గత 5 వేల సంవత్సరాలుగా వరి సాగు చేస్తున్నారు. ఇది ప్రధాన ఆహారంగా ప్రజలు తీసుకుంటున్నారు. వడ్లను మరపట్టి పాలిష్ చేయడం ద్వారా బియ్యం తెల్లగా మారుతాయి. అయితే, ఈ పాలిష్ చేయడం వల్ల బియ్యంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు తొలగిపోతాయి. చివరికి, ఇది కార్బోహైడ్రేట్ల మూలంగా మాత్రమే మారుతుంది.

వైట్ రైస్ ప్రయోజనాలు..

సులభంగా జీర్ణం అవుతుంది.

శరీరానికి శక్తిని ఇస్తుంది.

ఎముకల ఆరోగ్యానికి ఉత్తమమైనది.

గ్లూటెన్ రహితంగా ఉంటుంది.

బ్రౌన్ రైస్..

బ్రౌన్ రైస్ పాలిష్ చేయని ధాన్యం. బియ్యం గింజ చుట్టూ ఉన్న పొట్టును మాత్రమే తొలగించడం జరుగుతుంది. ఇందులో పెద్ద మొత్తంలో పోషకాలు ఉంటాయి. ఇది తెల్ల బియ్యం కంటే వగరు రుచిని కలిగి ఉంటుంది.

బ్రౌన్ రైస్ ప్రయోజనాలు..

పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఎముకలను బలంగా ఉంచుతుంది.

బరువు తగ్గించడంలో సహకరిస్తుంది.

బరువు తగ్గిస్తుందా?

పరిశోధన ప్రకారం.. బరువు తగ్గే విషయంలో వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. బ్రౌన్ రైస్ తినని వారి కంటే బ్రౌన్ రైస్ తినే వారు బరువు చాలా త్వరగా తగ్గినట్లు పరిశోధనలో తేలింది. తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో ఎక్కువ ఫైబర్, పోషకాలు, ఇతర సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ఎక్కువ కాలం కడుపుని నిండుగా ఉంచుతాయి.

గమనిక: ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ కథనాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని RTV ధృవీకరించడం లేదు.

Also Read:

తెలంగాణలో 80 శాతం కాంట్రాక్టులు మెఘాకే.. వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు..

తెలంగాణలో కీలక నేతల ఆస్తులు.. వారిపై ఉన్న కేసులు ఇవే..

#health-tips #health-issues #health #health-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe