సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. ఇందుకు సంబంధించి తాజాగా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అయితే ఆయన గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇప్పుడు లంగ్స్‌లో ఉన్న నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఆయనకు ఐసీయూలోని వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తాము ఇస్తున్న మందులకు తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని.. ఆరోగ్యం కుదుటపడగానే వెంటిలేటర్‌ను తొలిగించే అవకాశం ఉంటుందని చెప్పారు.
Also Read: నేడు ఆలయంలోకి రానున్న బాలరాముడు.. మొదలైన కార్యక్రమాలు..
తమ్మినేని వీరభద్రం ఖమ్మజిల్లాలోని తన స్వగ్రామమైన తెల్దాపల్లిగా ఉండగా ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తమ్మినేని పరీక్షించిన వైద్యులు పల్స్ తక్కువగా ఉండటాన్ని గుర్తించి చికిత్స చేశారు. ఆ తర్వాత గుండె కొట్టుకోవడంలో తేడాలున్నాయని వైద్యులు చెప్పడంతో.. కుటుంబ సభ్యులు ఆయన్ని ఖమ్మం నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలాఉండగా.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు (Paleru) నుంచి పోటీ చేసి తమ్మినేని ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు.
Also Read: ఇకనుంచి వాతావరణ సమాచారం మీ చేతిలోనే.. యాప్ ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి..