Health benefits of waking up early in the morning : ఎర్లీ టు బెడ్ .. ఎర్లీ టు రైజ్ అంటూ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ మాట వింటూనే ఉన్నాం. కానీ ఉదయాన్నే లేవాలంటే బద్ధకం. పోనీ రాత్రివేళ్లలో అయినా తొందరగా నిద్రపోతామా అంటే నైట్ పార్టీలు, నైట్ డ్యూటీలు , సినిమాలు, ఇవేమీ లేకపోతే సెల్ ఫోన్ చూస్తూ ఏ ఒంటిగంటకో నిద్రపోతాం. ఫలితంగా ఉదయాన్నే నిద్రలేచేసరికి బారెడు పొద్దెక్కుతుంది.మధ్యాన్నం దినచర్య మొదలుపెట్టి మళ్ళీ షరా మామూలే. అసలు .. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఇన్ని లాభాలున్నాయని మీకు తెలిస్తే రేపటి నుండే 5 గంటలకు అలారం సెట్ చేస్తారు.
మానసిక ఆరోగ్యానికి మేలు
ఉదయాన్నే నిద్ర లేవాలంటే ఖచ్చితంగా రాత్రివేళలో తొందరగా నిద్రపోవాలి. వేకువజామునే నిద్రలేవడం వల్ల మనలో నిగూఢమైన ఉన్న సానుకూలమైన అంతర్గత ఆలోచనలు మెరుగుపడతాయి. ఉదయం వేళల్లో ఉండే నిశ్శబ్ద సమయంలో ధ్యానం చేస్తే మంచి ఫ్గలితాలుంటాయి.మానసిక ఉల్లాసానికి ఎంతో మేలు చేసే ఈ ఉషోదయ సమయం మనసులో ఉన్న ఉద్రిక్తతలను తొలగించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.,
వ్యాయామానికి సమయం
ఉదయాన్నే చాలా బిజీ షెడ్యూల్ పెట్టుకున్నా సరే .. చాలా మంది లేట్ గా నిద్రలేచి ఉరుకుల పరుగులతో ఉద్యోగాలకు వెళ్తారు. ఫలితంగా బాస్ తో చీవాట్లు. అక్కడి నుంచే నెగిటివ్ వైబ్రేషన్స్ మొదలవుతాయి. కానీ ఉదయాన్నే లేవడం వల్ల, జాగింగ్, వాకింగ్ మరియు రన్నింగ్ వంటి వ్యాయామాలకు సమయం లభిస్తుంది. ఉదయం, ఇది మొత్తం శారీరక ఆరోగ్యానికి మంచిది.సరేనా సరైన టైంకు బ్రేక్ ఫాస్ట్ చేసి ఉద్యోగాలకు కూడా టైంకు కు వెళ్లొచ్చు. ఫలితంగా ఆరోజంతా చాలా హుషారుగా ఉంటారు.
నిద్ర నాణ్యత మెరుగ్గా ఉంటుంది
రాత్రి త్వరగా నిద్రపోవడం , ఉదయాన్నేతొందరగా మేల్కొలపడం వల్ల మన శరీరంలో ఉండే బయో క్లాక్ పర్ఫెక్ట్ గా ఉంటుంది దీని కారణంగా నిద్ర నాణ్యత వేగంగా మెరుగుపడుతుంది. మీరు రోజూ ఇలా ఇలా పాటిస్తే రోజువారీ జీవితంలో రిలాక్స్‌గా అనుభూతి చెందుతారు.
రోగనిరోధక శక్తి
మీరు త్వరగా నిద్రలేచినప్పుడు, ఉదయాన్నే సూర్యకాంతి మీ శరీరంపై పడుతుంది, ఈ సహజ కాంతి మీ అంతర్గత గడియారాన్ని నియంత్రిస్తుంది, దీని కారణంగా విటమిన్ డి ఉత్పత్తి పెరగడం ప్రారంభమయి రోగనిరోధక శక్తి పెరగడం ప్రారంభమవుతుంది, వైరల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
టైమ్ మేనేజ్‌మెంట్
జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించినవారు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఆ రోజు చేయ్యాల్సిన పనులను ప్లాన్ చేసుకుంటారు. మీ జీవితంలో ఓ రోజుని పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.ఉదయాన్నే కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాలు తొందరగా నెరవేరతాయి.
ALSO READ: మార్కెట్ లో లభించే టమాటో సాస్ వాడుతున్నారా ? ఇక .. మీ పని అంతే !!