Walnut Health Benefits: వాల్ నట్స్ లో విటమిన్స్, మినరల్స్ , విటమిన్ E, మెగ్నీషియం, ఫోలేట్ వంటి పోషకాహారలు పుష్కలంగా ఉంటాయి. మన రోజు ఆహారంలో వీటిని తీసుకుంటే శరీర పని తీరును మెరుగ్గా చేయును.వీటిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో రకాల లాభాలను ఇస్తాయి.
వాల్ నట్స్ తింటే కలిగే లాభాలు:
గుండె ఆరోగ్యం
ఇవి ఆరోగ్యమైన గుండెకు సహాయపడతాయి. వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. అంతే కాదు ఈ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో మంట, వాపుతో పాటు గుండె సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించును.
మెదడు పని తీరును మెరుగుపరుచును
వాల్ నట్స్ (Walnuts) లోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పని తీరును చురుకుగా చేయును. అలాగే గుండె ఆరోగ్యాన్ని నిర్వహించును. ప్రతీ రోజు వీటిని తగిన మోతాదులో తీసుకుంటే జ్ఞాపక శక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
పుష్కలమైన పోషకాహారాలను అందించును
విటమిన్ E, మెగ్నీషయం, ఫోలేట్ పోషకాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. మన రోజు ఆహారంలో వీటిని తీసుకుంటే శరీర పని తీరును మెరుగ్గా చేయును.
క్యాన్సర్ నివారించడంలో సహాయపడును.
వీటిలోని కాంపౌండ్ క్యాన్సర్ సెల్స్ పెరుగుదలను నిరోధించడంలో సహాయపడును. అంతే కాదు వాల్ నట్స్ లోని యాంటీ ఆక్సిడెంట్స్, పాలి ఫినాల్స్ క్యాన్సర్ ను నిరోధించడంలో సహాయపడును. దీని పై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
చక్కెర స్థాయిలను నియంత్రించును
కొన్ని పరిశోధనలు వాల్ నట్స్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని చెబుతున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం ఉన్న వారికి ఇవి చాలా మేలు చేస్తాయి.
Clove Health: లవంగంతో కలిగే.. హెల్త్ సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..! - Rtvlive.com