Sangareddy Crime : పెళ్లి(Marriage) కి ముందే ఓ వ్యక్తిని ప్రేమించింది. కానీ పెద్దలు వేరే వ్యక్తితో వివాహం చేశారు. కానీ మాజీ ప్రియునితో సంబంధం(Extra Marital Affair) మాత్రం ఆపలేదు. అసలే ఇష్టం లేని పెళ్లి.. మరోపక్క ప్రియుని మీద మోజుతో అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. అందుకే ఈ విషయాన్ని ప్రియుడికి తెలిపింది.
అతను మరో ముగ్గురితో కలిసి ప్రియురాలి భర్తను హత్య చేయడానికి ప్రణాళిక సిద్దం చేశాడు. దానికి ఆ ముగ్గురు డబ్బులు కావాలని అడగడంతో రూ. 50 వేలు డబ్బును ఇచ్చింది. అంత కలిసి 20 రోజుల పాటు రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం హత్య చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
సంగారెడ్డి డీఎస్పీ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జోగిపేటకు చెందిన చాకలి మల్లేశానికి (30) ఇటీవల అందోలులో డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు అయ్యింది. అందులో భార్య కల్పనతో కలిసి ఉంటున్నాడు. కల్పనకు చిన్నతనం నుంచి కూడా ఆమె స్నేహితుడు మహేశ్ అంటే ఇష్టం . వివాహం అయ్యాక కూడా అతనిని కలవడం ఆపలేదు. ఈ విషయం తెలిసిన మల్లేశం ఆమెతో గొడవపడేవాడు.
రెక్కీ నిర్వహించి..
దీంతో ఎలాగైనా మల్లేశాన్ని అడ్డు తొలగించుకోవాలని కల్పన ప్లాన్ చేసింది. ఈ విషయం మహేష్ కు చెప్పగా అతను మరో ముగ్గురితో కలిసి హత్యకు ప్రణాళిక సిద్దం చేశారు. ఆ ముగ్గురు డబ్బులు కావాలనడంతో సుఫారీ కింద రూ.50 వేలు ఇచ్చింది కల్పన. మల్లేశం ఇస్త్రీ దుకాణం నడుపుతుండడంతో ముందుగా రెక్కీ నిర్వహించిన దుండగులు అందోలులోని డబుల్ బెడ్రూం ఇళ్ల వెనక దారిలోకి మల్లేశం రాగానే తల పై బండరాయితో గట్టిగా బాదారు.
మహేశ్ తో పాటు అతని స్నేహితులు ఉసికె అంబాజీ, రంగంపేటకు చెందిన ఒకరు , గంగారం గ్రామాలకు చెందిన ఇద్దరితో కలిసి కారులో కిడ్నాప్ చేశారు. గొంతునులిమి కారులోనే మల్లేశాన్ని చంపేశారు. ముందు కారుని మెదక్ వైపు తిప్పి రామాయం పేట మీదుగా సిద్దిపేట రోడ్డులో తీసుకెళ్లారు. ఆ తరువాత కోనాపూర్ చెరువు వద్ద ఆగారు.
ఆ తరువాత మల్లేశం మృతదేహన్ని ఆనవాలు లేకుండా చేసేందుకు పెట్రోల్ చల్లి నిప్పంటించి దహనం చేశారు. అయితే తన కుమారుడు కనిపించడం లేదంటూ మల్లేశం తల్లి శుక్రవారమే జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం కోనాపూర్ చెరువు కట్ట దగ్గర శవం పడి ఉన్నట్లు స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం వచ్చింది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతదేహం కనిపించకుండా పోయిన మల్లేశానిదిగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా మల్లేశం భార్యని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు ఆమెతో పాటు ఆమె ప్రియుడు మహేష్ హత్యకు సహకరించిన నిందితులను అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్ కు తరలించారు.
Also read:నేడు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారం !