Skin Infection: సీజన్‌తో సంబంధం లేకుండా కొందరికి స్కిన్ సంబంధించి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకు అనేక కారణాలు ఉంటాయని చర్మ వైద్య నిపుణులు అంటున్నారు. కొందరికి ఇలాంటి సమస్యలు వచ్చే తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి సమస్య ఉంటే దీనికి ప్రత్యేక కారణం ఉండొచ్చని సూచిస్తున్నారు. అయితే.. ఈ సమస్యకు ప్రధాన కారణం రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం,డయాబెటిస్ ఉండటంవల్ల అలా జరుగుతుందంటున్నారు. డయాబెటిస్ కేవలం కళ్లు, గుండె, కిడ్నీలు, లివర్‌తోపాటు చర్మ సంబంధింత విషయాల్లోనూ సమస్యలు వస్తాయని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. అయితే.. కొన్ని రకాల స్కిన్ సమస్యలకు మధుమేహం కూడా ప్రధాన కారణం కావచ్చు. దాని గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
సోరియాసిస్:
ఎక్కువగా టైప్ 2 డయాబెటిస్ బాధితుల్లో ఈ రకమైన చర్మ సమస్య వచ్చే అవకాశం ఉంది. దీనివలన చర్మపై తెల్లటి పొలుసులు వస్తాయి. దురద వలన చర్మం ఎరుపు అయ్యి.. పొడిబారుతుంది. ఫలితంగా ఎలివేటెడ్ రక్తంలో షుగర్ లెవల్స్ యూరిన్‌ను క్రియేట్ చేసి చర్మ సెల్స్ నుంచి లిక్విడ్‌ను తీసే క్రమంలో శరీరానికి ఉపయోగపడుతాయి. స్కిన్ పొడిబారడం, పగుళ్లు వంటి వస్తాయి. వీటితోపాటు డయాబెటిక్ న్యూరోపతి, నరాల బలహీనత వంటివి చర్మంపై పగుళ్లకు కారణం అవుతాయని వైద్యులు అంటున్నారు.
ఫంగల్ ఇన్ఫెక్షన్స్:
మధుమేహం ఉన్నవారికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. కాలి వ్రేళ్ల మధ్య, చంకల్లో, నోటి దగ్గరగా దద్దుర్లు , గొంత కింద, మోచేయి మడతల భాగంలో, పొలుసులుగా కనిపిస్తే ఖచ్చితంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అనుకోవచ్చు. వీటితోపాటు బాక్టీరియల్ ఇన్పెక్షన్ల రిస్క్ కూడా వస్తుంది. అందుకే డయాబెటిస్ రోగులు చర్మంపై దద్దుర్లు, దురద, రంగు మారడం వంటివి కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండ వెంటన డాక్టర్లను సంప్రదించాలని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మన పూర్వికులు మట్టి పాత్రల్లో వంట చేయడానికి కారణం ఇదే
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.