Sunset : అంతరిక్షంలో సూర్యాస్తమయం.. ఎలా ఉంటుందో చూశారా? సూర్యోదయం, సూర్యాస్తమయం.. ఉభయ సంధ్యలను చూడాలని కోరుకోనివారెవరు? సూర్య నమస్కారాలతో ఉదయాన్ని.. సాయం సంధ్య వేళలలో యోగాతో రాత్రిని ఆహ్వానిస్తుంటారు కూడా. భూమ్మీద సూర్యాస్తమయాన్ని చూడటం సరే.. మరి అంతరిక్షంలోంచి చూస్తే ఎలా కనిపిస్తుందో తెలుసా? By Durga Rao 05 May 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Space : సూర్యోదయం(Sunrise), సూర్యాస్తమయం.. ఉభయ సంధ్యలను చూడాలని కోరుకోనివారెవరు? సూర్య నమస్కారాలతో ఉదయాన్ని.. సాయం సంధ్య వేళలలో యోగా(Yoga) తో రాత్రిని ఆహ్వానిస్తుంటారు కూడా. భూమ్మీద సూర్యాస్తమయాన్ని చూడటం సరే.. మరి అంతరిక్షంలోంచి చూస్తే ఎలా కనిపిస్తుందో తెలుసా? ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసిన నాసా.. అమెరికా(America) అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తీసిన ఫొటోను విడుదల చేసింది. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఐఎస్ఎస్ లోని ఓ వ్యోమగామి ఈ చిత్రాన్ని క్లిక్ మనిపించారు. తాజాగా నాసా(NASA) దీనిని తమ అధికారిక ఇన్ స్టా అకౌంట్లో పోస్టు చేసింది. భూమి, ఆకాశం నల్లగా ఉండి.. భూమి నుంచి కిందికిపోతూ సగం మేర కనిపిస్తున్న సూర్యుడితో ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. సూర్యుడి కిరణాల ప్రభావంతో.. ఎగువన నీలి రంగులో, మధ్యలో తెల్లగా, దిగువన నారింజ రంగులో వాతావరణ పొరలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by NASA (@nasa) Also Read : నిద్రపోయిన స్టేషన్ మాస్టర్..ముందుకు సాగని పాట్నా-కోటా రైలు.. #instagram #nasa #space మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి