Uttara Pradesh: హత్రాస్‌ కేసులో ప్రధాన ముద్దాయి అరెస్ట్‌ - ఎస్పీ నిపుణ్

ఉత్తరప్రదేశ్‌ లోని హత్రాస్‌ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో హత్రాస్‌ జిల్లా ఎస్పీ నిపుణ్‌ అగర్వాల్‌ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడైన దేవ్‌ ప్రకాశ్‌ మధుకర్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

New Update
Uttara Pradesh: హత్రాస్‌ కేసులో ప్రధాన ముద్దాయి అరెస్ట్‌ - ఎస్పీ నిపుణ్

ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌లో హత్రాస్ కేసలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాశ్ మధుకర్ పట్టుబడ్డాడు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో 121మంది మరణానికి ఇతడు కారణమయ్యాడు.తొక్కిసలాట ఘటనపై విచారణ వేగవంతంగా కొనసాగుతోందని... హత్రాస్‌ జిల్లా ఎస్పీ నిపుణ్‌ అగర్వాల్‌ ప్రెస్‌మీట్‌ లో చెప్పారు. అతడిని అరెస్ట్‌ చేసి హత్రాస్‌కు తీసుకొచ్చామని అన్నారు. అంతకుముందు అతనిపై లక్ష రూపాయల రివార్డు ప్రకటించామని తెలిపారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని అగర్వాల్ చెప్పారు.

సత్సంగ్‌ కార్యక్రమానికి విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. కేసును ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్టుమెంట్‌ దృష్టికి కూడా తీసుకెళ్తాం. విరాళాల సేకరణలో అవకతవకలుంటే వాళ్లు వదిలిపెట్టరు అని ఎస్పీ నిపుణ్‌ అగర్వాల్‌ చెప్పారు. కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితుడు దేవ్‌ ప్రకాశ్‌ మధుకర్‌.. నారాయణ్‌ సకార్‌ హరి అలియాస్‌ భోలే బాబాకు ప్రధాన సహాయకుడు. తొక్కిసలాటకు కారణమైన సత్సంగ్‌ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది మధుకరే అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

యూపీ (Uttar Pradesh) హత్రాస్‌ తొక్కిసలాట ఘటన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చాడు భోలే బాబా (Bhole Baba). ఆ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘జులై 2 ఘటనతో మేం చాలా వేదనకు గురయ్యాం. ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు బాధను భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. తొక్కిసలాటకు కారణమైన వారంతా తప్పించుకోలేరు. బాధ్యులందరికీ శిక్ష పడుతుందని నేను నమ్ముతున్నా. నాకు ప్రభుత్వంపై నమ్మకం ఉంది. మృతులు, గాయపడిన కుటుంబాలకు అండగా ఉండాలని మా కమిటీ సభ్యులకు చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చారు. 

జులై 2న హత్రాస్ లో నిర్వహించిన సత్సంగ్‌కు 80వేల మందికి ఏర్పాట్లు చేయగా దాదాపు రెండున్నర లక్షలమంది హాజరయ్యారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకోగా 121 మందికి పైగా మరణించారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు.

Also Read:Russia-Ukrain: ఉక్రెయిన్‌లో మళ్ళీ దాడులు..లక్ష ఇళ్ళల్లో చీకటి

Advertisment
తాజా కథనాలు