TS Assembly Session: మొత్తం కరోనానే చేసింది.. అసెంబ్లీలో హరీష్ రావు!

అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై స్పందించారు హరీష్ రావు. కరోనా, కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే తెలంగాణలో అప్పులు పెరిగిపోయాయి అని అన్నారు. కేంద్రం నిధులు ఇచ్చి ఉంటే లక్ష కోట్ల అప్పు తగ్గేదని ఆయన అన్నారు.

New Update
TS Assembly Session: మొత్తం కరోనానే చేసింది.. అసెంబ్లీలో హరీష్ రావు!

BRS MLA Harish Rao: శ్వేతపత్రంలో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు తప్పు అని పేర్కొన్నారు. ఈ నివేదికను ఓ రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారితో తయారు చేయించారని మండిపడ్డారు. సీఎం గురువు దగ్గర పనిచేసిన మోదీ అధికారులతో ఈ నివేదిక వండివార్చినట్లు ఆధారాలున్నాయని అన్నారు. నివేదికలో కరోనా ఏడాది లెక్కలు చూపించారు.. ఆదాయం, ఆస్తులు ఎలా పెరిగాయో సరిగా లెక్కలు చూపలేదని తెలిపారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో అప్పులు పెరిగాయంటూ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం తమపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ALSO READ: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమ!

హరీష్ మాట్లాడుతూ.. తెలంగాణ సొంత ఆదాయం ఎలా పెరిగిందన్నది చూపలేదు శ్వేతపత్రంలో పేర్కొనలేదని అన్నారు. ఆరోగ్యంపై తక్కువగా ఖర్చు పెట్టామనేది అవాస్తవం అని తేల్చి చెప్పారు. కరోనా (Coronavirus) వల్ల కేంద్రం ఎక్కువగా అప్పులు తీసుకునేలా చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా, కేంద్ర ప్రభుత్వ వివక్ష వల్ల భారం పడిందని అన్నారు. అయినా సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని పేర్కొన్నారు. కేంద్రంతో మా ఎంపీలు పోరాడారని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఈ విషయంలో కేంద్రాన్ని ఎప్పుడూ అడగలేదని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు.

ALSO READ: తెలంగాణ అప్పుల లెక్కలు ఇవే!

పన్నుల్లో వాటా సెస్‌ల రూపంలో ఎగ్గొట్టారని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ విద్యుత్‌ బకాయిలు కేంద్రం వల్లే రాలేదని క్లారిటీ ఇచ్చారు. సీఎస్‌ఎస్‌లో కేంద్రం వల్లే నష్టపోయాం అని అన్నారు. లక్షకోట్ల కేంద్రం నుంచి రాకపోవడం వల్లే ఇబ్బంది కలిగిందని తెలిపారు. ఇవి వస్తే ఇంకో లక్ష కోట్ల అప్పు తగ్గేదని పేర్కొన్నారు. సంబంధం లేని రుణాలన్నీ చూపి 6 లక్షల కోట్ల అప్పులు తేల్చారు అని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అప్పులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించలేదనేది పూర్తి అబద్ధం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థిపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని కోరారు. లేదంటే పెట్టుబుడు ఆగిపోయి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావు అని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి కూడా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు.

Advertisment
తాజా కథనాలు