Harish Rao : అసెంబ్లీలో హరీశ్‌ నోట గద్దర్, అందెశ్రీ పాట.. వీడియో వైరల్‌!

కాంగ్రెస్ దుర్మార్గపు పాలన మీద కలమెత్తని తెలంగాణ కవి లేడని.. గళమెత్తని తెలంగాణ గాయకుడు లేడన్నారు హరీశ్‌రావు. ఆయన స్వయంగా గద్దర్‌, అందెశ్రీ పాటలను అసెంబ్లీలో పాడారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

New Update
Harish Rao : అసెంబ్లీలో హరీశ్‌ నోట గద్దర్, అందెశ్రీ పాట.. వీడియో వైరల్‌!

Harish Rao Remembers Gaddar : సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) పరిపాలనో తెలంగాణ(Telangana) అనుభవించిన కరువు బాధలను, నీళ్ల గోసలను, అంతులేని వివక్షను, అడ్డులేని దోపిడీని చూసి ఆగ్రహించి పాటరాయని కవి లేడంటూ రేవంత్‌ సర్కార్‌(Revanth Sarkar) పై నిప్పులు చెరిగారు హరీశ్‌రావు(Harish Rao). ఇక ఆయన నోట నుంచి గద్దర్‌, అందెశ్రీ పాటలు రావడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఏం పాడారంటే?

1)కాంగ్రెస్ పాలనలోరన్నో మనకు కన్నీళ్లే మిగిలాయిరన్నో
గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది. కృష్ణమ్మ తల్లిరాకన్నీల్లు రాల్చింది.
సింగరేణి తల్లి సిన్నబోయినాది. సిక్స్ టెన్ జీవోనేమో జీరో అయ్యినాది.

అని కాంగ్రెస్ దుర్మార్గపు దాష్టీకాల గురించి ప్రజా యుద్ధనౌక గద్దర్ రాశారని హరీశ్‌రావు గుర్తుచేశారు.

2) ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి
దక్సిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి
నీళ్లు లేక నోళ్లు తెరిచెబీళ్లను చూడు
మా పల్లెలన్నీ బోసిపోగ తల్లడిల్లుతున్న తల్లీ
చూడు తెలంగాణ, చుక్కలేని నీళ్లు లేని దాన
మా గోడు తెలంగాణ, బతుకు పాడైన దాన..

అని అందెశ్రీ కాంగ్రెస్ పాపిష్టి పరిపాలనను శపిస్తూ రాసినారని చెప్పారు హరీశ్‌రావు.

3)వానమ్మవానమ్మఒక్కసారన్నవచ్చిపోవేవానమ్మ
చేలల్ల నీళ్లు లేవు, చెలకల్ల నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కండ్లల్ల నీళ్ళు లేవు.

అని హృదయం ద్రవించి పోయేలా మరో కవి జయరాజు గారు పాటలు రాశారన్నారు హరీశ్‌రావు

Also Read : వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్‌ మూడేళ్లకే ముక్కలు అయ్యింది!

Advertisment
తాజా కథనాలు