Harish Rao: రైతు బంధు ఎప్పుడు వేస్తారు?.. హరీష్ రావు ఫైర్! రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రైతు బంధు పెంచుతాం అన్నారు.. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను ప్రశ్నించారు. By V.J Reddy 09 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rythu Bandhu : అసెంబ్లీ ప్రారంభమైన మొదటి రోజే తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని అన్నారు. రైతులకు బోనస్ ఇస్తాం అని ఎన్నికల సమయంలో చెప్పారు.. వడ్లకు రూ.500 బోనస్ ఎప్పుడు ఇస్తారు? వడ్లు కొనుగోలు ఎప్పుడు చేస్తారు? చెప్పాలి అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు బంధు(Rythu Bandhu) పెంచుతాం అన్నారు.. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను అడుగుతున్నాం అని హరీష్ అన్నారు. తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ రైతులపై హామీల వర్షం కురిపించింది. రైతు బంధు నిధులను ఏడాదికి రూ.15వేలకు పెంచుతామని తెలిపింది. అలాగే కౌలు రైతులకు కూడా రైతు బంధు సాయం కింద రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని పేర్కొంది. రైతులు పండించిన వరి పంటకు రూ.500 బోనస్ కూడా ఇవ్వనున్నట్లు చెప్పింది. ఇదిలా ఉండగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు గాను మొదటిగా రెండు గ్యారెంటీలను ఈ రోజు అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్య శ్రీ రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచింది. ఈరోజు నుంచి ఇది అమల్లోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు సీఎం రేవంత్. అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ మేం ప్రజల పక్షాన నిలబడతామని మాజీ మంత్రి @BRSHarish స్పష్టం చేశారు. రైతాంగమంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకోకండి, బోనస్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.… pic.twitter.com/JkjoZaqEZl — BRS Party (@BRSparty) December 9, 2023 Also Read : రెండో గ్యారెంటీ అమలుకు శ్రీకారం..ఈరోజే రాజీవ్ ఆరోగ్యశ్రీ మొదలు #cm-revanth-reddy #telangana-assembly #harish-rao #rythu-bandhu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి