Harish Rao Comments On Rythu Runa Mafi: తెలంగాణలో మూడోసారి గులాబీ జెండా ఎగరవేసేందుకు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలైన సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్ (KTR), మంత్రి హరీష్ రావు (Harish Rao) వరుస జిల్లాల పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. ప్రతీ నియోజకవర్గానికి వెళుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. కొత్త బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు అర్ధం అయ్యేలా వివరిస్తున్నారు. మూడోసారి ముచ్చటగా కేసీఆర్ ను సీఎం చేద్దాం అంటూ ప్రచారం చేస్తున్నారు.
ALSO READ: సీఎం కేసీఆర్ కు కోటి రూపాయిల అప్పు ఇచ్చిన నేత.. ఎవరంటే?
ఇదిలా ఉండగా మంత్రి హరీష్ రావు రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.14,000 కోట్ల రుణమాఫీ చేసిందని అన్నారు. రుణమాఫీ పైసలు ఆపాలి, గొర్రెల పెంపకం పైసలు ఆపాలే, దళిత బంధు పైసలు ఆపాలే, యాసంగి పంటకు రైతు బంధు ఇచ్చుడు ఆపాలే అని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. వీరి ఫిర్యాదుతోనే దళిత బంధు, రైతు బంధు, రుణమాఫీ ప్రక్రియ ఆగిందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఆపడం తప్ప ఇవ్వడం చేతకాదు అని విమర్శించారు. ఈ పార్టీలకు చెడగొట్టుడు తప్ప చేయడం తెలీదు అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకల మాటలు జూటా మాటలని పేర్కొన్నారు.
ALSO READ: అది జరిగితే కేసీఆర్, కేటీఆర్, కవిత జైలుకే… RS ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు
డిసెంబర్ 5 తరువాత తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి హరీష్. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కరూపాయి కూడా లేకుండా రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 నుంచే రుణమాఫీ ప్రక్రియ మొదలు పెడుతామని అన్నారు.