Pawan Kalyan : పవన్‌ ఇప్పటికైనా మిత్రులెవరో.. శత్రువులెవరో తెలుసుకో : హరిరామజోగయ్య మరో లేఖ!

జనసేన బాగు కోరి నేను ఇచ్చిన సలహాలు మీకు నచ్చినట్లు లేవు. జనసేనకు 40 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉంటే కేవలం 24 ఇచ్చారు. దానిని నేను ఖండించాను. అలా ఖండించినందుకు నేను వైసీపీ కోవర్ట్ ని అయ్యానా... అంటూ హరిరామ జోగయ్య పవన్‌ ని ప్రశ్నించారు.

Pawan Kalyan : పవన్‌ ఇప్పటికైనా మిత్రులెవరో.. శత్రువులెవరో తెలుసుకో : హరిరామజోగయ్య మరో లేఖ!
New Update

Harirama Jogayya : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan)  కి కాపు పెద్దల నుంచి వరుస లేఖాస్త్రాలు అందుతున్నాయి. మొన్న కాపు పెద్ద , మాజీ మంత్రి హరిరామ జోగయ్య(Harirama Jogayya)  పెద్దగా నేను ఇచ్చిన సలహాలు మీకు నచ్చనప్పుడు ఏమి చేయలేను.. ఇక మీ ఖర్మ అంటూ దండం పెట్టగా... నిన్న ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) కూడా పవన్‌ కల్యాణ్‌ మీద విమర్మనాస్త్రాలు సంధిస్తూ లేఖ రాశారు.

ఈ క్రమంలోనే మరోసారి చేగొండి హరిరామజోగయ్య పవన్‌ కు లేఖ రాశారు. అందులో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తుంది.

''జనసేన బాగు కోరి నేను ఇచ్చిన సలహాలు మీకు నచ్చినట్లు లేవు. బహిరంగ సభలో నా పేరు పెట్టి విమర్శించకపోయినా ఎల్లో మీడియా(Yellow Media) చేస్తూన్న ప్రచారం చేస్తూంటే నన్ను విమర్శించినట్టే అనిపిస్తుంది. ఒకప్పుడు చంద్రబాబే(Chandrababu) సీఎం అని లోకేష్(Lokesh) అంటే నేను ఖండించాను... అలా ఖండించినందుకు నేను వైసీపీ కోవర్ట్ అయ్యాను. నేను వైసీపీ కోవర్ట్ ఎలా అయ్యానో పవనే చెప్పాలి.

జనసేన(Janasena) కు 40 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉంటే కేవలం 24 ఇచ్చారు. దానిని నేను ఖండించాను. అలా ఖండించినందుకు నేను వైసీపీ కోవర్ట్ ని అయ్యానా. బీజేపీ కూటమిలో చేరటానికి ఇష్టపడక అడ్డంకులు సృష్టిస్తుంటే.. మీ బాగు కోరే బీజేపీ మీతో ఉండాలని, కూటమిలో తీసుకోవాలని కోరినందకు నేను వైసీపీ కోవర్ట్ ని అయ్యానా.?

జరుగుతున్న పరిణామాలు బట్టి మిత్రులెవరో..శత్రువులేవరో తెలుసుకుని ప్రవర్తించడం మంచిది. జనసేన లేకుండా టీడీపీ గెలవడం సాధ్యం కానీ పని. అందుకే చంద్రబాబు మీతో  జతకట్టాడు. ఎన్నికలు అయ్యాక చంద్రబాబు మీకు సముచిత స్థానం ఇస్తాడని నమ్మకం లేదు. ఎన్నికైన తరువాత జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి తన కొడుకు లోకేష్‌ ను సీఎం చేస్తాడనే భయం జనసైనికుల్లో ఉంది.

నన్ను వైసీపీ కోవర్టు అని జనసేనలో ఉన్నవారే అంటున్నారు... అలా అంటున్నవారంతా టీడీపీ కోవర్టులు కాదా? మిమ్మల్ని ప్యాకేజీ వీరుడిగా మీ మీద విమర్శలు చేస్తుంటే... ఈ దుష్ప్రచారాన్ని చంద్రబాబు కానీ, లోకేష్‌ కానీ ఖండించారా? మిమ్మల్ని రాజకీయాల నుంచి నిర్వీర్యం చేసి టీడీపీ లబ్ది పొందాలని చూస్తుంది.

మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని కాపాడుకోవడం నా విధి....నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలానే ఉంటుంది. మీకు అధికారంలో సముచిత స్థానం కల్పించే వరకు నా పోరాటం కొనసాగుతుంది.'' అంటూ హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.

Also Read : TDP-Janasena Alliance: ఇక మీ ఖర్మ.. పవన్‌, చంద్రబాబుకు జోగయ్య దండం 🙏🙏🙏 !

#harirama-jogayya #mudragada-padmanabham #janasena #pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి