Harirama Jogaiah: అధినేత ఏ నిర్ణయం తీసుకున్న ఆయన వెంటే మేము!

చంద్రబాబు జైల్లో ఉన్నప్పటికీ..టీడీపీకి నాయకత్వ లోటు ఏమి ఉండదని, రానున్న రోజుల్లో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, లోకేష్‌ భార్య బ్రహ్మణి కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.

Harirama Jogaiah: అధినేత ఏ నిర్ణయం తీసుకున్న ఆయన వెంటే మేము!
New Update

Harirama Jogaiah: రాష్ట్రంలో ప్రస్తుతం జనసేన పరిస్థితి చాలా మెరుగుపడిందని మాజీ హోం మంత్రి, జనసేన నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అరెస్ట్ (Chandrababu Arrest) చేసిన తరువాత టీడీపీ (TDP) మైలేజ్‌ బాగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. జనసేన అధినేత టీడీపీతో కలిసి నడుస్తామని ప్రకటించిన తరువాత టీడీపీ పరిస్థితి కొంచెం మెరుగుపడిందని వివరించారు.

టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కొందరికి నచ్చక పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న మాట వాస్తవమే అని ఆయన పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌  ఏ నిర్ణయం తీసుకున్న కూడా దానికి 90 శాతం మంది జనసేన నాయకులు అనుకూలంగా ఉన్నారు. తెలంగాణలో జనసేన (Janasena) ఒంటరిగా వెళ్లడం మంచిది కాదు అని పవన్‌ కి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

Also read: ఐదో రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రులు

తెలంగాణ లో జనసేనను బీజేపీ (BJP) తో కలవాలని పెద్దలు కోరారు. కానీ పవన్‌ తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న దానికి పార్టీ కట్టుబడే ఉంటుంది. ఏపీలో కూడా జనసేన, బీజేపీ కలిసి వెళ్లవు అనడం అనేది ఏ మాత్రం కరెక్ట్‌ కాదు. పవన్‌ కి మోడీ (PM Modi) అంటే చాలా ఇష్టం. ఆయన వ్యక్తిత్వం అంటే పవన్‌ కి మరింత ఇష్టం. పవన్‌ ఇప్పటికీ ఎన్డీయేలోనే ఉన్నారు.

తెలంగాణలో బీజేపీతో పొత్తు ఎలా ఉన్నప్పటికీ..ఏపీలో మాత్రం జనసేన, బీజేపీ, టీడీపీ కలిసే నడుస్తాయి. కానీ కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు అందరూ వేచి ఉండాల్సిందే. తెలంగాణ హైకోర్ట్‌ సీఎం జగన్‌ పై ఉన్న కేసులన్ని ఎన్నికలకు ముందే తేల్చాలని పిల్‌ వేశాను. దాని గురించి కొన్ని రోజుల్లో తీర్పు వస్తుంది.

చంద్రబాబు మీద అభియోగాలు ఇంకా రుజువు కాలేదు. కేవలం ఆయన మీద ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబుకు బెయిల్‌ వచ్చినా కేసులు మాత్రం అలా నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎలా అయితే బెయిల్‌ మీద బయట ఉన్నారో..చంద్రబాబు కూడా అలాగే బెయిల్ మీద బయట ఉంటారు.

చంద్రబాబు జైల్లో ఉన్నప్పటికీ..టీడీపీకి నాయకత్వ లోటు ఏమి ఉండదని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, లోకేష్‌ భార్య బ్రహ్మణి కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

#harirama-jogayya #pawankalyan #bjp #tdp #janasena #chandrababu-naidu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe