Hardik Pandya Divorce: హార్దిక్ పాండ్యాలానే విడాకులు తీసుకున్న క్రికెటర్లు వీరే!

హార్దిక్ పాండ్యా -నటి నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. వారిద్దరూ తమ 4 సంవత్సరాల వివాహాన్ని ముగించుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. పాండ్యాలానే గతంలో మరికొందరు భారత క్రికెటర్లు విడాకుల టెన్షన్ అనుభవించారు. వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

New Update
Hardik Pandya Divorce: హార్దిక్ పాండ్యాలానే విడాకులు తీసుకున్న క్రికెటర్లు వీరే!

Hardik Pandya Divorce: భారతదేశంలో, వివాహాన్ని పవిత్ర బంధంగా పరిగణిస్తారు. అయితే, కొన్నిసార్లు దానిని నిలబెట్టుకోవడం కష్టంగా మారుతుంది. అనివార్య పరిస్థితుల్లో భార్యాభర్తలు విడిపోవాల్సి వస్తుంది. క్రికెటర్ హార్దిక్ పాండ్యా - నటాషా స్టాంకోవిచ్ మధ్య సంబంధంలో కూడా అలాంటిదే కనిపించింది. ఈ నిర్ణయం తనకు అంత సులభం కాదని.. బాధతో తీసుకున్నదని  హార్దిక్ అన్నారు. ఈ విడాకులతో అతను తన కొడుకును కూడా కోల్పోయాడు. అతని కొడుకు అగస్త్య తల్లి నటాషాతో కలిసి సెర్బియా వెళ్లాడు. పాండ్యా కంటే ముందే, విడాకుల బాధల్ని ఎదుర్కొన్న కొందరు క్రికెటర్లు ఉన్నారు. వారెవరో చూద్దాం.. 

శిఖర్ ధావన్
ఒకప్పుడు రోహిత్ శర్మకు ఓపెనింగ్ పార్టనర్‌గా ఉన్న శిఖర్ ధావన్ విడాకుల బాధను అనుభవించాడు. అతను 2009లో మెల్‌బోర్న్‌లో ఆయేషా ముఖర్జీతో నిశ్చితార్థం చేసుకున్నాడు, ఆపై వారు 2012లో వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇద్దరూ 11 సంవత్సరాల పాటు వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య సంబంధంలో చీలిక వచ్చి 2023లో మానసిక వేధింపుల కారణంగా అయేషాకు ధావన్ విడాకులు ఇచ్చాడు. ఆయేషా - ఆమె కుమారుడు జోరావర్ ఆస్ట్రేలియా పౌరులు. వారు అక్కడ నివసిస్తున్నారు. 

publive-image

దినేష్ కార్తీక్
దినేష్ కార్తీక్ తన చిన్ననాటి స్నేహితురాలు నికితా బంజారాను 2007లో 21 ఏళ్ల వయసులో పెళ్లాడాడు. ఈ పెళ్లి కోసం చాలా టైం తీసుకుని చాలా ప్లాన్ చేసుకున్నాడు. వారి కుటుంబాల మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి.  కానీ, వారి వివాహం 5 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. 2012లో, కార్తీక్ భార్య అతని సహచర క్రికెటర్ మురళీ విజయ్‌తో సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్ షాక్ అయ్యాడు. దీని తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. తర్వాత కార్తీక్ 2015లో స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ని పెళ్లాడాడు.

publive-image

మహ్మద్ షమీ
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 2014లో హసిన్ జహాన్‌ను పెళ్లాడాడు. వీరిద్దరి తొలి సమావేశం ఐపీఎల్‌లో జరిగింది. ఆ సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు హాసిన్ జహాన్ చీర్ లీడర్‌గా ఉండేవారు. పెళ్లయిన 4 ఏళ్ల తర్వాత, షమీకి పెళ్లి కాకుండా ఇతర అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని, 2018లో గృహహింసకు పాల్పడ్డారని హసిన్ జహాన్ బహిరంగంగా ఆరోపించింది. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. అయితే వీరిద్దరి కేసు ఇంకా కోర్టులోనే ఉంది. . షమీకి హసీన్ జహాన్‌తో పాటు ఒక కుమార్తె కూడా ఉంది. తాజాగా ఆయన తన కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

publive-image

మహ్మద్ అజారుద్దీన్
భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న మహ్మద్ అజారుద్దీన్ ఒక్కసారి కాదు రెండు సార్లు విడాకులు తీసుకున్నాడు. అతను 1996లో తన మొదటి భార్య నౌరీన్‌తో విడాకులు తీసుకున్నాడు.  బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత, అతను సంగీతా బిజ్లానీతో విడాకులు తీసుకున్నాడు.

publive-image

వినోద్ కాంబ్లీ
భారత క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన చిన్ననాటి స్నేహితురాలు నోయెల్లా లూయిస్‌ను 1998లో వివాహం చేసుకున్నాడు. తన  భార్యపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపణలు ఎదుర్కున్నాడు.  ఆ తర్వాత భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.

publive-image

జావగల్ శ్రీనాథ్
జవగల్ శ్రీనాథ్ భారత ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం, అతను ICCకి మ్యాచ్ రిఫరీగా పనిచేస్తున్నాడు. అతను 1999లో జ్యోస్నను వివాహం చేసుకున్నాడు.  కానీ, 8 సంవత్సరాల తర్వాత 2007లో విడాకులు తీసుకున్నాడు. ఒక సంవత్సరం తరువాత, అతను జర్నలిస్ట్ మాధవి పాత్రావళిని వివాహం చేసుకున్నాడు.

publive-image

Advertisment
తాజా కథనాలు