ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య? ఏబీ డివిలియర్స్ ఏమన్నారంటే

హర్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్ తిరిగి రాబోతున్నాడు. కెప్టెన్ బాధ్యతలు చేపట్టబోతున్నాడనే వార్తలపై ఏబీ డివిలియర్స్ స్పందించారు. హార్దిక్ ముంబైకి తిరిగి వెళ్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్‌ భారాన్ని తగ్గించుకునేందుకు హర్దిక్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్నారు.

New Update
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య? ఏబీ డివిలియర్స్ ఏమన్నారంటే

AB de Villiers about Hardik Pandya: ఐపీఎల్ 2024 మినీ వేలం దుబాయ్ వేదికగా డిసెంబర్ 19వ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ఆటగాళ్లను అట్టి పెట్టుకోవడం, వదిలించుకోవాలనే విషయంపై నవంబర్ 26 సాయంత్రం నాలుగు గంటలకు డెడ్ లైన్ ముగియనుంది. అయితే గతంలోకంటే ఈసారి స్టార్ క్రికెటర్లకు భారీ డిమాండ్ పెరిగే అవకాశం ఉండగా.. ఐపీఎల్ (IPL) 2024 లో పాల్గొనే జట్లలో అనూహ్య మార్పులు, పలు సంచలనాలు నమోదవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వ్యవహారం చర్చనీయాంశమైంది. హర్దిక్ మళ్లీ తన సొంతగూటికి ముంబై జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో హార్దిక్ ముంబై జట్టులోకి వస్తే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారనే అంశంపై ఇప్పటికే బిగ్ డిబెట్ నడుస్తుండగా సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ కూడా తన అభిప్రాయం వెల్లడించారు.

Also read : India vs Australia: భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఈరోజు.. డిటైల్స్ ఇవే..

ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డివిలియర్స్ మాట్లాడుతూ.. హర్దిక్ పాండ్య తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి వస్తే రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీ నుంచి వైదొలుగుతాడని అభిప్రాయపడ్డారు. 'అక్కడ ఏం జరిగిందో నాకు కచ్చితంగా తెలియదు. కానీ హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్‌కు తిరిగి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అది వారికి కొంచెం ఇబ్బంది కలిగిస్తుందని అనుకుంటున్నా. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్. కెప్టెన్సీ చేయడాన్ని అతడు చాలా ఇష్టపడతాడని మనందరికీ తెలుసు.

కానీ ఇప్పటికే రోహిత్‌ టీమ్‌ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటున్నాడు. దీంతో అతడు ఐపీఎల్‌లో కెప్టెన్సీ భారాన్ని వదులుకుని హార్దిక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశముంది. పాండ్య వస్తే ముంబైకి చాలా లాభం చేకూరుతుంది. ఎందుకంటే అతడు ముంబైకి చాలాకాలంపాటు ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు. వాంఖడే మైదానంలో ఆడటాన్ని హార్దిక్‌ ఇష్టపడతాడు. అతను కెప్టెన్‌గా గుజరాత్‌ టైటాన్స్‌కు టైటిల్ అందించాడు. తర్వాతి సీజన్‌లో జట్టుని ఫైనల్‌ వరకు తీసుకెళ్లాడు. టైటాన్స్‌ తరఫున తన పని పూర్తి అయ్యిందని భావిస్తున్నాడేమో’ అంటూ డివిలియర్స్‌ తన మనసులో మాట బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతుండగా క్రికెట్ లవర్స్ లో మరింత టెన్సన్, క్యూరియాసిటీ పెరిగిపోయింది.

Advertisment
తాజా కథనాలు