/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-11-8.jpg)
Hardik Pandya : భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ నాలుగేళ్ల బంధానికి ముగింపు పలకబోతున్నట్లు తెలిపాడు. నటాషా, తాను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు.
View this post on Instagram
ఇది కఠినమైన నిర్ణయమే..
గత కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇన్నాళ్ల ఊహాగానాల మధ్య చివరకు హార్దిక్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. నాలుగేళ్ల అనుబంధం తర్వాత భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లు తెలిపాడు. '4 సంవత్సరాలపాటు కలిసి ఉన్న నటాషా, నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము కలిసివుండటానికి మా వంతు ప్రయత్నం చేసాము. చివరికి విడిపోవాలనే ఫిక్స్ అయ్యాం. ఇది మా ఇద్దరికీ మేలు చేస్తుందని బలంగా నమ్ముతున్నాం. ఇది కఠినమైన నిర్ణయమే. మేము కలిసి ఆనందించిన క్షణాలు, పరస్పర గౌరవం, సాహచర్యం అన్నింటితో కలిపి మేము ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాం. మేము అగస్త్యునితో ఆశీర్వదించబడ్డాం. అతను మా ఇద్దరి జీవితాలకు కేంద్రంగా కొనసాగుతాడు. అతని ఆనందం కోసం మనం చేయగలిగినదంతా చేస్తాం. అతనికోసం మేము సహ-తల్లిదండ్రులుగా ఉంటాం' అంటూ చెప్పుకొచ్చాడు పాండ్య.