Happy Days : జిల్ జిల్ జిగా.. హ్యాపీ డేస్ రీ రిలీజ్.. ఫ్యాన్స్ కు పండగే

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2007 లో విడుదలైన ‘హ్యాపీ డేస్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏప్రిల్ 12న రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

Happy Days : జిల్ జిల్ జిగా.. హ్యాపీ డేస్ రీ రిలీజ్.. ఫ్యాన్స్ కు పండగే
New Update

Happy Days Re-Release :  నేషనల్ అవార్డు విజేత దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హ్యాపీ డేస్. 2007లో విడుదలైన ఈ సినిమా యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్ గా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమాలో శేఖర్ కమ్ముల దర్శకత్వం, నటీ నటుల నటన, మిక్కీ మేయర్ మ్యూజిక్ ప్రేక్షకుల మదిలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి.

సినిమా విడుదలై దాదాపు పదిహేనేళ్ళు దాటిన.. ఇప్పటికీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఓ ఇంజనీరింగ్ కాలేజీలో మొదలయ్యే ఈ సినిమా కథలో .. వివిధ మనస్థత్వాలు కలిగిన విద్యార్థుల మధ్య ఏర్పడిన స్నేహం, ప్రేమ, కాలేజీ లైఫ్ లో వారు ఎదుర్కొనే సమస్యలు గురించి చూపిస్తూ మ్యాజిక్ క్రియేట్ చేశారు శేఖర్ కమ్ముల. ఇక 'హ్యాపీ డేస్' చూసే చాలా మంది ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిత్రం.

Also Read: Disha Patani: మైనస్‌ డిగ్రీల చలిలో ప్రభాస్‌తో క్యూట్‌ బ్యూటీ రొమాన్స్‌ .. ఇటలీ ఫొటోలు వైరల్!

publive-image

హ్యాపీ డేస్ రీ రిలీజ్

అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన ఈ చిత్రం మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్పెషల్ గా ఏప్రిల్ 12న 'హ్యాపీ డేస్' రీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. గ్లోబల్ సినిమాస్ సంస్థ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయనున్నారు. వరుణ్ సందేశ్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, హీరో నిఖిల్ సిద్ధార్థ్ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.

Happy Days - Varun Sandesh - Tamannah

Also Read : Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్’ లో అలాంటి పాత్ర చేయడానికి కారణం ఇదే.. వైరలవుతున్న అనుపమ కామెంట్స్..!

#tamannah #happy-days-re-releasing #varun-sandesh #happy-days-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe