Disha Patani With Prabhas -Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 AD’. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వైజయంతి బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీస్ దిశా పటానీ, దీపికా పదుకొనె తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 70% శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ ప్రభాస్, దిశా పటానీ కాంబినేషన్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Disha Patani: మైనస్ డిగ్రీల చలిలో ప్రభాస్తో క్యూట్ బ్యూటీ రొమాన్స్ .. ఇటలీ ఫొటోలు వైరల్!
ప్రభాస్ లేటెస్ట్ చిత్రం 'కల్కి'. ప్రస్తుతం ఈ మూవీ ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ ప్రభాస్, దిశా కాంబోలోని సీన్స్ తెరకెక్కిస్తుండగా.. సెట్స్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది దిశా. మైనస్ డిగ్రీల చలిలో దుప్పటి కప్పుకొని వణికిపోతున్న వీడియోను పోస్ట్ చేసింది.
Translate this News: