Happy Birthday Virat Kohli: విరాట్ కొహ్లీ.. ఇతడి గురించి దేశంలో పరిచయం అక్కర్లేదు. క్రికెట్ అభిమానులతో పాటు క్రికెట్ చూడని వాళ్లకి కూడా ఇతడు సుపరిచితుడు. టీనేజీలో భారత జట్టులో చేరిపోయి ఆ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న విరాట్ కొహ్లీ (Virat Kohli) ఈరోజు 35వ ఏట అడుగుపెట్టారు. అతని పుట్టినరోజు సందర్భంగా.. క్రీడాకారులు, అభిమానులు శుభాకాంక్షలతో ముంచేస్తున్నారు. 1988 నవంబర్ 5న ప్రేమ్ కొహ్లీ, సరోజ్ కొహ్లీ దంపతులకు విరాట్ కొహ్లీ జన్మించాడు. 2006 నవంబర్‌లో తమిళనాడుకు వ్యతిరేకంగా రంజీ ట్రోఫి మ్యాచ్‌లో కోహ్లి ఆరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2008 లో అండర్-19, ఐసీసీ ప్రపంచ కప్పులో భారత జట్టుకు విజయం అందించాడు. 2008 ఆగష్టులో తన వన్డే అరంగేట్రం చేసిన విరాట్.. 13 వ ఇన్నింగ్స్లో తొలి అంతర్జాతీయ సెంచరీని సాధించి, 2009 లో శ్రీలంకతో 107 పరుగులు చేశాడు.
అయితే ఇప్పుడు ప్రపంచ కప్ (World Cup 2023) జరుగుతున్న నేపథ్యంలో విరాట్ పుట్టినరోజు రావడం క్రికెట్ అభిమానులకు మరింత ఆనందాన్ని ఇస్తోంది. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు విరాట్ అప్పుడప్పుడే యంగ్ రైసింగ్ స్టార్‌గా ఎదుగుతున్నాడు. ఇండియాకు వరల్డ్‌కప్ సాధించేందుకు విరాట్ కూడా తనవంతు కీలక పాత్రను పోషించాడు. ఆ తర్వాత స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ఎదిగి 2015 నుంచి 2019 వరకు టీమిండియా కెప్టెన్‌గా (Indian captain) సారథ్యం వహించాడు. ఆ తర్వాత కెప్టెన్‌గా తన బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ మంచి బ్యాట్స్‌మెన్‌గా ముందుకెళ్తున్నాడు. ఇక ప్రస్తతం జరుగుతున్న 2023 వరల్డ్‌కప్‌లో కూడా కొహ్లీ మంచి పర్ఫామెన్స్ కనబరుస్తున్నాడు. పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగన మ్యాచ్‌లో 103 పరుగులు సాధించాడు. అలాగే తర్వాతీ మ్యాచుల్లో నాలుగు అర్థ సెంచరీలు చేశాడు.
భారత జట్టులో (Indian Team) లెజెండ్ ఆటగాల్లు ఉన్నారు. కానీ వాళ్లు తమ కెరీర్‌లో రెండుసార్లు ఓడీఐ (ODI ప్రపంచకప్‌లో గెలవలేకపోయారు. కేవలం కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్‌లు మాత్రమే రెండుసార్లు ఓడీఐ ప్రపంచకప్‌లో గెలవగలిగారు. అయితే ఇప్పుడు ఆ అవకాశం కొహ్లీకి కూడా రానుంది. ఈసారి ఇండియా జట్టు వరల్డ్ కప్ సాధిస్తే విరాట్ కొహ్లీ కూడా వాళ్లిద్దరి లాగే రెండుసార్లు ప్రపంచకప్‌లో గెలిచిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇక ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటిదాకా జరిగిన ఏడు ఇన్నింగ్స్‌లో కొహ్లీ 442 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన మ్యాచుల్లో సెంచరీకి దగ్గరగా వచ్చి మిస్ అయ్యాడు. అయినప్పటకీ వరల్ట్‌కప్‌లో తన బెస్ట్ పర్మామెన్స్‌ను ఇస్తున్నాడు.
Also Read: కోహ్లీ బర్త్‌డే మ్యాచ్.. టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు?
ఇక గత మూడేళ్లుగా విసుగు విరామం లేకుండా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడేస్తూ వస్తున్న విరాట్ కొహ్లీకి పుట్టినరోజు వేడుకలను ప్రపంచకప్ మ్యాచ్ ల నడుమ జరుపుకోడం ఓ అలవాటుగా మారిపోయింది. 2021లో దుబాయ్ వేదికగా స్కాట్లాండ్ తో జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ ఆడుతూ తన 33వ పుట్టినరోజును జరుపుకొన్న విరాట్ ..ఆ తర్వాతి (34వ) పుట్టినరోజును ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో క్రీడాపాత్రికేయుల సమక్షంలో జరుపుకొన్నాడు. ఇక ఈ ఏడాది నవంబర్ 5న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికాజట్ల మధ్య జరిగే 8వ రౌండ్ మ్యాచ్ రోజునే.. విరాట్ కొహ్లీ 35వ పుట్టినరోజు కావడంతో నిర్వాహక బెంగాల్ క్రికెట్ సంఘం పనిలోపనిగా అట్టహాసంగా అతడి పుట్టినరోజు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ లో దంచికొడుతూ కళ్లు చెదిరే విజయాలతో నాకౌట్ రౌండ్ కు చేరువగా వచ్చిన భారత్- దక్షిణాఫ్రికా జట్ల బ్లాక్ బస్టర్ ఫైట్ ను చూసేందుకు 80వేల నుంచి లక్షమంది వరకూ అభిమానులు తరలి రానున్నారు. స్టేడియంలోని అభిమానుల్లో దాదాపు 70వేలమందికి విరాట్ కొహ్లీ మాస్క్ లను (Virat Kohli Masks) అందచేయనున్నారు. కొహ్లీ కోసం బెంగాల్ క్రికెట్ సంఘం ప్రత్యేకంగా తయారు చేసి బహుకరించనుంది.