Minister Jai Shankar : ''హనుమంతుడు పెద్ద దౌత్యవేత్త''..విదేశాంగ మంత్రి జై శంకర్‌!

హనుమంతుడు పెద్ద దౌత్యవేత్త..అందుకే ఆ రోజున లంకకు రాయబారిగా రాముడు హనుమంతుణ్ణి పంపించారు'' అంటూ విదేశాంగ మంత్రి జై శంకర్‌ వ్యాఖ్యానించారు. భారత్‌ లోనే ఎన్నో ఉదాహరణలు ఉండగా పక్క దేశాలు, పశ్చిమ దేశాలను ఏదోక టాపిక్‌ ను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని జైశంకర్‌ పేర్కొన్నారు.

New Update
Minister Jai Shankar : ''హనుమంతుడు పెద్ద దౌత్యవేత్త''..విదేశాంగ మంత్రి జై శంకర్‌!

Jai Shankar : విదేశాంగ మంత్రి జై శంకర్(Jai Shankar) గురించి ప్రస్తావిస్తూ నా లాంటి ఉద్యోగాన్ని రామాయణంలో(Ramayana) హనుమంతుడు(Hanuman) కూడా నిర్వహించాడు అని పేర్కొన్నారు.'' హనుమంతుడు పెద్ద దౌత్యవేత్త(Huge Diplomat)..అందుకే ఆ రోజున లంకకు రాయబారిగా రాముడు హనుమంతుణ్ణి పంపించారు'' అంటూ వ్యాఖ్యానించారు.

భారత్‌ లోనే ఎన్నో ఉదాహరణలు ఉండగా పక్క దేశాలు, పశ్చిమ దేశాలను ఏదోక టాపిక్‌ ను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని జైశంకర్‌ పేర్కొన్నారు. లంకకు వెళ్లిన హనుమంతుడు ఏమి ఊరకనే ఉండలేదు..ఒక ఇంటెలిజెన్స్‌ మిషన్‌(Intelligence Mission) తో పని చేశారు. సీతమ్మకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన సేకరించారు.

అంతే కాకుండా లంక నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ నగరానికే నిప్పు పెట్టి ఎంతో చాకచక్యంగా బయటకు వచ్చేశారు అని జై శంకర్‌ అన్నారు. అంతేకాకుండా రావణుడి సభలోనే హనుమంతుడు ఆడిన మైండ్ గేమ్‌ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే '' రావణుని సభలోనే రావణుడు, మంత్రుల కంటే కూడా హనుమంతుడు ఎంతో ఎత్తైన సీటులో కూర్చున్నాడు. దీని వల్ల రావణుడు మైండ్‌ ఫుల్లుగా డిస్ట్రర్బ్‌ అయ్యింది.

వాటిని అన్నింటిని చూసుకుంటే నేటి కాలమాన పరిస్థితుల్లో కూడా హనుమంతుడి వ్యూహాలను , ఆలోచలను సందర్భాన్ని బట్టి దౌత్యపరంగా అమలు చేసుకోవచ్చు అంటూ జై శంకర్ తెలిపారు.

జై శంకర్‌ తన కొత్త పుస్తకం '' వై భారత్ మేటర్స్‌''(Why Bharat Matters) లో రామాయణం, మహా భారతం పై ఒక అధ్యాయాన్ని కలిగి ఉన్నాడు. అయోధ్య(Ayodhya) లోని రామ జన్మభూమిలోని వివాదస్పద స్థలాన్ని దేవాలయం కోసం సుప్రీం కోర్టు 2019లో కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రామ జన్మభూమి(Ram Janmabhoomi) అయోధ్యలో బాలరామున్ని ప్రతిష్టించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు, భక్తులు తరలి వచ్చి దర్శించుకున్నారు.

Also read: బీజేపీ వాషింగ్ మెషిన్ లోకి వెళ్లిన ప్రతిదీ తెల్లగానే ఉంది..కలుషితం కాలేదు”: ఖర్గే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు