HanuMan Movie : తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రతిష్ట తెచ్చిన సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు విదేశాలలో కూడా దూసుకుపోతోంది. ఇప్పటికే భారతదేశంలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం.. తాజాగా జపాన్‌లో రిలీజ్ కానుంది. అక్టోబర్ 4న ఇది అక్కడి ప్రేక్షకులను అలరించనుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.ఈ మేరకు తన పోస్ట్‌ల.."హనుమాన్ జపాన్‌లో రిలీజ్ కాబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది తెలుగు సినిమాకి గొప్ప విజయం. జపాన్ ప్రేక్షకులు హనుమాన్‌ని ఎంతగా ఆదరిస్తారో చూడాలి" అని పేర్కొన్నారు. తేజ సజ్జా, అమృతాఅయ్యర్ జంటగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించారు.
Also Read : రాజమౌళి – మహేష్ మూవీకి యూనివర్సల్ టైటిల్.. ఏంటంటే?
రూ.40 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశల్లో ఉన్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో ఆంజనేయుడి పాత్రలో కనిపించనున్నారు. 2025 సంక్రాతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.