లాభాల్లో హనుమాన్ .. వసూళ్లు చూస్తే మైండ్ బ్లాక్ !!

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన హనుమాన్ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి అడుగుపెట్టింది. హనుమాన్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా వరల్డ్ వైడ్ గా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సీజన్ తరువాత అన్ని థియేటర్స్ హనుమాన్ సినిమాకే కేటాయించే అవకాశాలున్నాయి.

New Update
లాభాల్లో హనుమాన్ .. వసూళ్లు చూస్తే మైండ్ బ్లాక్ !!

HanuMan : సంక్రాంతి సీజన్ జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగిపోతోంది. ప్రశాంత్ వర్మ (Prasanth varma) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన హనుమాన్ చిత్రం కలక్షన్ల తో దూసుకుపోతోంది. తేజ సజ్జ నటనకు , ప్రశాంత్ వర్మ విజువల్ ట్రీట్ కు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుతోంది. ఇక.. యూఎస్ మార్కెట్లో అయితే .. వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి అడుగు పెడుతోంది.

1.5 మిలియన్ మార్క్ టచ్

సాలీడ్ ప్రీమియర్స్ తో ఆరంభం అయిన ఈ మూవీ పోస్ట్ కోవిడ్ సింగిల్ డే లో ఏకంగా 5 లక్షల డాలర్లు వసూళ్లు రాబట్టి రికార్డ్ సెట్ చేయగా ఇప్పుడు రిలీజయిన రెండు రోజుల్లోనే ఎవ్వరూ అధిగమించని 1.5 మిలియన్ మార్క్ ని టచ్ చేసి మరో రికార్డ్ క్రియేట్ చేసింది.
రెండు రోజులకే ఇలా ఉంటె లాంగ్ రన్ లో ఇంకెన్ని రికార్డులు కియేట్ చేస్తుందొ అంటూ ట్రేడ్ అనలిస్టులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నేటితో 10 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు

ఇక.. ఈ మూవీ నార్త్ లోనూ త సత్తా చూపిస్తుండటం విశేషం. ఫస్ట్ డేనే 2 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, సెకెండ్ డే 4.05 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు హను మాన్ క్రేజ్ చూసి విస్తుపోతున్నారు.ఇక.. ఆదివారం రోజు వసూళ్మ గురించి చెప్పే అవసరమే లేదు. నేటితో 10 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టింది.

బుక్ మై షోలో సెన్సేషన్

బుక్ మై షో లో హను మాన్ కేవలం 2 రోజుల్లోనే 10 లక్షల పైగా టికెట్స్ బుక్ అయి సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషమేం చెప్పాలి . ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు.ఇది కదా హనుమాన్ పవర్ అంటూ నెటిజనులు స్పందిస్తున్నారు.

హనుమాన్ మూవీ 12 భాగాలు

హనుమాన్ మూవీ 12 భాగాలుగా వస్తుందని .. ఈ భాగాల్లో ఒక్కో సూపర్ హీరో ఉంటాడని కూడా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మొదట్లో ఈ రేంజ్ భారీ స్కేల్ లో ప్లాన్ చెయ్యలేదని .. అవుట్ ఫుట్ చూస్తూ నిర్మాత ప్రోత్సహించడంతో దీని స్కేల్ మారిందని చెప్పుకొచ్చాడు. (Teja sajja)తేజ సజ్జ నటనతో పాటు, వరలక్ష్మి శరత్ కుమార్ , వినయ్ రాయ్ ల నటన ఈ సినిమాలో ఆకట్టుకుంది. ఇక.. ఈ మూవీ హిట్ అయినా సరే థియేటర్ల సమస్యలు వెంటాడుతున్నాయి. థియేటర్స్ వారితో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్స్ ఇవ్వడం లేదని తెలుగు చిత్ర నిర్మాతల మండలిలో హనుమాన్ మేకర్స్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.అయితే థియేటర్ యాజమాన్యం చేస్తున్న చర్యలపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేశారు.

థియేటర్స్ అన్నీ హనుమాన్ కే
పండగ సీజన్లో ఈ రోజు ( Naa samiranga) నా సామిరంగా చిత్రం రిలీజయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటున్న సరే .. హనుమాన్ చిత్రం ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. రోజు రోజుకి హనుమాన్ మూవీ దూసుకుపోతుండటంతో ఈ పండగ నాలుగు రోజుల తరువాత అన్నీ థియేటర్స్ హనుమాన్ కు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సమయం ఓ వైపు .. మరో వైపు యావత్ భారత దేశంలో హను మాన్ మూవీ సృష్టిస్తున్న రికార్డులు మరో వైపు.. ఈ క్రమంలో హనుమాన్ మూవీ మేకర్స్ ముందుగా అనుకున్నట్లుగానే ఈ సినిమా కు తేజ్ ప్రతీ టికెట్ నుంచి 5 రూపాయాలు చొప్పున అయోధ్య రామ మందిరానికి విరాళం ఇచ్చారు. మొత్తంగా రెండు రోజుల అమౌంట్ కలిపి 14 లక్షలు రూపాయాలు విరాళం అందజేశారు.

ALSO READ:వైరల్ అవుతోన్న మహేష్ బాబు – రమ్యకృష్ణ ఐటెం సాంగ్.. తల్లీ కొడుకులుగా ఎలా చూపిస్తావు అంటూ ట్రోల్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు