Hanooman AI : భారత్‌కు చెందిన హనుమాన్ ఏఐ మోడల్ వచ్చేసింది

ఇండియాకు చెందిన హనుమాన్‌ అనే ఏఐ మోడల్‌ ఫ్లాట్‌ఫాం వచ్చేసింది. 3ఏఐ హోల్డింగ్ లిమిటెట్, ఎస్‌ఎమ్‌ఎల్ ఇండియా సంస్థలు.. హనుమాన్‌ ఏఐ మోడల్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటన చేశాయి. ఇందులో మొత్తం 98 భాషలు ఉన్నాయి. వీటిలో 12 భారతీయ భాషలు కూడా ఉన్నాయి.

New Update
Hanooman AI : భారత్‌కు చెందిన హనుమాన్ ఏఐ మోడల్ వచ్చేసింది

AI : ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగం డిజిటల్ రంగం(Digital Sector) లో విప్లవాత్మక మార్పులు తీసుకోస్తోంది. ఇప్పటికే చాట్‌జీపీటి(ChatGPT) లాంటి ఏఐ చాట్‌బాట్‌కు నెటీజన్లు ఎంతగా ఆకర్షితులయ్యారో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇండియా(India)కు చెందిన హనుమాన్‌ అనే మరో ఏఐ మోడల్‌ వచ్చేసింది. 3ఏఐ హోల్డింగ్ లిమిటెట్, ఎస్‌ఎమ్‌ఎల్ ఇండియా సంస్థలు.. హనుమాన్‌ ఏఐ(Hanooman AI) మోడల్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటన చేశాయి. ఈ కొత్త ఏఐలో మీ ఫొన్‌ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇది బహుభాషాలు కలిగిన జెన్‌ఏఐ ప్లాట్‌ఫాం. ఇందులో మొత్తం 98 భాషలు ఉన్నాయి. వీటిలో 12 భారతీయ భాషలు కూడా ఉన్నాయి.

Also Read: తల్లి కాళ్లకు నమస్కరించిన కేజ్రీవాల్

అవి హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడ, ఒడియా, పంజాబీ, అస్సామీ, తమిళ్, తెలుగు, మళయాళం, సింధీ. అయితే ఈ హనుమాన్ ఏఐ మోడల్‌ ప్రస్తుతం టెక్స్ట్ చేసిన మెసెజ్‌లకు స్పందిస్తుంది. ఇక ఈ హనుమాన్ ఏఐ మోడల్‌ను బెంగళూరుకు చెందిన సీతా మహాలక్ష్మీ (SML) కంపెనీ.. 3 ఏఐ హోల్డింగ్, స్టార్ల్‌వార్ట్స్, హెచ్‌పీ, యొట్టా, NASSCOM లాంటి పలు కంపెనీల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది.

Also Read: కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న దండకారణ్యం

Advertisment
Advertisment
తాజా కథనాలు