Hamas-Israel: 58 బందీలను విడుదల చేసిన హమాస్.. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే..

ఇజ్రాయెల్,హమాస్‌ల మధ్య బందీల శని, ఆదివారాల్లో విడుదల సాఫీగా సాగింది. ఇప్పటివరకు హమాస్‌ 58 మంది బందీలను విడుదల చేయగా.. ఇజ్రాయెల్ 114 మంది బందీలను విడుదల చేసింది. సోమవారం కూడా ఇజ్రాయెల్, హమాస్‌లు మరికొంతమందిని విడుదల చేయనున్నాయి.

New Update
Hamas-Israel: 58 బందీలను విడుదల చేసిన హమాస్.. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే..

ఇజ్రాయెల్‌, హమాస్‌ల మధ్య శని, ఆదివారాల్లో రెండు, మూడు విడతల బందీల విడుదల సజావుగా సాగింది. హమాస్‌.. 26 మంది ఇజ్రాయెలీ వాసులతో పాటు మరో 8 మంది విదేశీయుల్ని విడుదల చేయగా.. 75 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలిపెట్టింది. శనివారం రాత్రి విడుదలైన 36 మంది పాలస్తీనా ఖైదీలు ఆదివారం ఉదయం వెస్ట్‌బ్యాంక్‌కు చేరుకున్నారు. ఇక రెండో విడుతలో భాగంగా హమాస్ విడిచిపెట్టిన నలుగురు థాయ్‌లాండ్ వాసులతో పాటు బందీలు ఇజ్రాయెల్, ఈజుప్టుకు వచ్చేశారు. అయితే రెండో విడతలో విడుదలైన బందీల్లో ఏడుగురు పిల్లలతో పాటు ఆరుగురు మహిళలు ఉన్నారు.

Also Read: ముగుస్తున్న ఎక్సైజ్‌ పాలసీ గడువు.. తక్కువ ధరలకు మద్యం అమ్మితే రూ.4 లక్షలు జరిమాన

ఆదివారం రోజున మూడో విడుతలో భాగంగా హమాస్‌.. 14 మంది ఇజ్రాయెలీ వాసులతో పాటు ముగ్గురు విదేశీయుల్ని విడిచిపెట్టింది. అయితే వీళ్లలో కొంతమంది ఈజిప్టుకు వెళ్లిపోగా.. మిగిలినవారిని ఇజ్రాయెల్‌ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. దీంతో ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనీయన్లను విడుదల చేస్తోంది. ఇక సోమవారం రోజున నాలుగో విడుత బందీలను కూడా ఇజ్రాయెల్, హమాస్‌లు విడుదల చేయనున్నాయి. ఆదివారం నాటికి చూసుకుంటే హమాస్‌ 58 మంది బందీలను విడిచిపెట్టగా.. ఇజ్రాయెల్ 114 మంది బందీలను విడుదల చేసింది.

Also read: బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం…ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్..!!

Advertisment
తాజా కథనాలు