/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T213821.697.jpg)
Hamas: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాస్త చల్లారినట్లే అనిపించినా మళ్లీ ఇరుదేశాలు దాడులకు పాల్పడుతున్నాయి. ఈ నెలరోజుల్లో మొదటిసారిగా ఇజ్రాయెల్ పై 'బిగ్ మిస్సైల్'ను ప్రయోగించింది హమాస్. ఈ మేరకు దక్షిణ గాజాలోని రఫా ప్రాంతం నుంచి సెంట్రల్ ఇజ్రాయెల్ వైపు ఎనిమిది రాకెట్లు పేల్చినట్లు ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ ఈ రాకెట్లను అడ్డుకుందని, అత్యవసర వైద్య సేవల బృందం తమకు ప్రాణనష్టం గురించి ఎలాంటి నివేదికలు అందలేదని తెలిపింది.