Gutha Sukender Reddy: కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ కీలక నేత.. క్లారిటీ! TG: తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. పార్టీ మార్పు అనేది అవాస్తవం అని అన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. By V.J Reddy 20 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Gutha Sukender Reddy: తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. పార్టీ మార్పు అనేది అవాస్తవం అని అన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కష్టాల్లో ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో నిర్మాణ లోపం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని వ్యాఖ్యానించారు. ALSO READ: సీఎం జగన్ వద్ద అప్పు చేసిన షర్మిల.. వెలుగులోకి కీలక విషయాలు! ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు చేయడం వల్లే కష్టాల్లో పడిందని అన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందని.. బీఆర్ఎస్ ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం అని తెలిపారు. న్యాయబద్దంగా.. రాజ్యాంగబద్దంగా నిర్ణయం తీసుకుంటా అని అన్నారు. కేసీఆర్ తన కొడుకు అమిత్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వలేదనేది అవాస్తవం అని పేర్కొన్నారు. అమిత్‌ను ఎంపీ పోటీలో దించాలని స్వయంగా కేసీఆర్ కోరినట్లు చెప్పారు. ఎంపీగా పోటీ చేసేందుకు అమిత్ కూడా సిద్ధమయ్యారని.. జిల్లాలోని నాయకుల నుంచి సహకారం అందలేదని అన్నారు. కొందరు నేతలు తామే పార్టీ మారుతున్నామని చెప్పారని.. అందుకే పోటీ నుంచి అమిత్ తప్పకున్నారని స్పష్టం చేశారు. #brs #kcr #gutha-sukender-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి