Delhi: ఖలిస్తాన్ మద్ధతుదారుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన.. ఢిల్లీ బార్డర్‌లో రైతులు తెలుపుతున్న నిరసనకు తన సంపూర్ణ మద్ధతు తెలుపుతూనే రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు రైతులు, కేంద్రప్రభుత్వం తీరు, పోలీసులను ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు.
తుపాకులు పట్టుకోండి..
'హర్యానా, పంజాబ్ పోలీసులపై రైతులంతా తిరగబడాలి. అవసరమైతే మీ చేతిలో తుపాకులు పట్టుకోండి. పంజాబ్ బార్డర్ లో పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ నుంచి రైతులు ఆయుధాలను తెచ్చుకోండి. హర్యానా - పంజాబ్ సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీ పాయింట్ల వద్ద ఆందోళన చేస్తున్న రైతులు తుపాకులు చేతపట్టండి. బుల్లెట్లకు బుల్లెట్లతోనే జవాబు చెప్పాలి’అంటూ ఈ సందేశంలో చెప్పుకొచ్చాడు. రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రుల టీమ్ నాలుగో విడత చర్చలు జరపడానికి సరిగ్గా కొన్ని గంటల ముందు గురుపత్వంత్ ఈ వీడియో సందేశాన్ని విడుదల చేయడం గమనార్హం.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైలర్ అవుతుండగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ధోరణి సరైనది కాదని, హింసను ప్రేరేపించడం వల్ల దేశం అల్లకల్లోలం అవుతుదంటూ కామెంట్స్ చేస్తున్నారు.'