Guntur Kaaram: ఈ పండగ నుంచి పెద్ద పండగ వరకూ గుంటూరు కారం మోత మోగుతుంది

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మూవీ గుంటూరు కారం. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవబోతోంది. గుంటూరు కారంతో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు ఇద్దరూ. అందుకే మూడు నెలల పాటూ ప్రమెషన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Guntur Kaaram: ఈ పండగ నుంచి పెద్ద పండగ వరకూ గుంటూరు కారం మోత మోగుతుంది
New Update

Guntur Kaaram: గుంటూరు కారం ప్రమోషన్స్​ మొదలుపెట్టాలని మూవీ టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దసరా నుంచి ప్రమోషన్స్​ ప్రారంభించి సంక్రాంతి (Sankranti) వరకూ గ్యాప్ లేకుండా బ్యాక్​ టు బ్యాక్ అప్డేట్స్ అండ్ సర్​ప్రైజెస్​ తో అభిమానుల్లో జోష్ నింపాలని అనుకుంటున్నారట. గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ అవనుంది. పెద్ద పండగకు విడుదల అవుతున్న సినిమా లిస్ట్ పెద్దగా ఉండడంతో...గుంటూరు కారంకి అన్నింటికంటే ఎక్కువ బజ్ ఉండేలా చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది.

ఈ ప్లాన్ లో భాగంగా గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ (Guntur Kaaram First Single)​ ను దసరా కన్నా ముందే రిలీజ్ చేయాలని మేకర్స్​ అనుకుంటున్నారు. ఆడియో సింగిల్​ను రిలీజ్​ చేసి.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్​ గ్యాప్ లేకుండా అప్డేట్స్​ ఇస్తానే ఉంటామన్న సంకేతాలను ఇవ్వడంతో పాటు సినిమా ఎలా ఉండబోతుందో రుచి చూపించనున్నారట. మూవీ కచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని టీమ్ మొత్తం నమ్మకంలో ఉన్నారు.

ఇకపోతే ఇప్పటివరకు పోస్ట్​పోన్​ చేసుకుంటూ ఎన్నో కష్టాలను ఎదుర్కోని ఈ మధ్యే ఆపకుండా షూటింగ్​ జరుపుకుంటున్న ఈ గుంటురు కారం చిత్రాన్ని.. ఎలాగైనా వచ్చే ఏడాది 2024 సంక్రాంతికి రిలీజ్ చేసే దిశగా ముందుకు వెళ్తోంది మూవీటీమ్​. అందుకు తగ్గట్టు షెడ్యూల్స్​ ను ప్లాన్​ చేసి షూటింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. సినిమా గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా అవేమీ గుంటూరు కారం రిజల్ట్ ను దెబ్బ తీయలేవని ప్రొడ్యూసర్ నాగవంశీ నమ్మకంగా చెబుతున్నారు. ఈసినిమాలో మహేష్ (Mahesh Babu) సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్​ మీద ఎస్‌.రాధాకృష్ణ గ్రాండ్​ గా నిర్మిస్తున్నారు.

Also Read: విశాఖకు రాజధాని…సంచలన జీవో జారీ

దటీజ్ విరాట్…నవీన్‌ను ట్రోల్ చేయొద్దని ఫ్యాన్స్ కు రిక్వెస్ట్

#guntur-kaaram #trivikram #maheshbabu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe