Guntur Kaaram: రాజమౌళిపై గుంటూరు కారం నిర్మాత సంచలన కామెంట్స్

Guntur Kaaram:మహేష్ బాబు,,త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న మాస్ ఎంటెర్టైనర్ గుంటూరు కారం. 2024 సంక్రాంతి బరిలోకి దిగనున్న ఈ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నిర్మాత రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Guntur Kaaram: రాజమౌళిపై గుంటూరు  కారం నిర్మాత సంచలన కామెంట్స్
New Update

Guntur Kaaram:సూపర్ స్టార్ మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గుంటూరు కారం. 2024 సంక్రాంతి బరిలోకి దిగనున్న ఈ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇప్పటుకికే రిలీజయిన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అయితే .. ఈ మూవీకి సంభందించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో గుంటూరు కారం చిత్ర నిర్మాత రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంక్రాంతి బరిలో5పెద్ద సినిమాలు

Guntur Kaaram: ఈ సంక్రాంతికి తెలుగు సినిమా పందెం కోళ్లు రెడీ అయ్యాయి. ఈసారి ఏకంగా 5 పెద్ద సినిమాలు బరిలో ఉన్నాయి. వీటిలో మహేశ్ బాబు 'గుంటూరు కారం' కూడా ఒకటి. జనవరి 12న రిలీజ్ కాబోతున్నఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. రీసెంట్ గా రిలీజైన 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కు అల్టిమేట్ రెస్పాన్స్ వస్తోంది. ఇక.. సామాజిక మాధ్యమాల్లో గుంటూరు కారం మ్యానియా మాములుగా లేదు. . ఎక్స్‌లో అయితే గుంటూరు కారం హ్యాష్ ట్యాగ్‌లు తెగ ట్రెండ్ అవుతున్నాయి.ఇక వీటికి తోడు మహేశ్ బాబు ఫ్యాన్స్‌కి అదిరిపోయే వార్త చెప్పారు ప్రొడ్యూసర్ నాగ వంశీ.

'గుంటూరు కారం' చిత్రానికి థియేటర్లు తగ్గిస్తారంటూ ప్రచారం

"డియర్ సూపర్ ఫ్యాన్స్.. మీకు మళ్లీ స్ట్రాంగ్‌గా చెబుతున్నా.. మేము అదే మాట మీద ఉన్నాం. గుంటూరు కారం సినిమాను రికార్డ్ నంబర్ ఆఫ్ థియేటర్లలో రికార్డ్ లెవల్లో రిలీజ్ చేస్తాం. రిలీజ్ మాకు వదిలేయండి.. సెలబ్రేషన్స్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీది." అంటూ నాగ వంశీ ఓ ట్వీట్ చేశారు. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో 'గుంటూరు కారం' చిత్రానికి థియేటర్లు తగ్గిస్తారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. దీంతో భారీగా సినిమాను రిలీజ్ చేయాలంటూ మహశ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. దీంతో మరోసారి ఫ్యాన్స్‌కి క్లారిటీ ఇచ్చారు నాగ వంశీ.ఇక.. ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో భాగంగా నాగవంశీ మాట్లాడుతూ .ప్రతీ ఏరియాలో రాజమౌళిగారి నంబర్లుకు దగ్గరగా వెళ్లిపోతామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.

#superstar-mahesh-babu #gunturkaaram #2024-sankrathi-movies #producer-nagavamsi #trivikram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి