Guntur: చంద్రబాబు అరెస్టుకు‌ నిరసనగా టీడీపీ ఆందోళనలు

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఏపీలో ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో పోలీసులు పలువురు టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నారు.

New Update
Guntur: చంద్రబాబు అరెస్టుకు‌ నిరసనగా టీడీపీ ఆందోళనలు

టీడీపీ నేతల‌ హౌస్ అరెస్ట్‌

గుంటూరులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు‌ నిరసనగా టీడీపీ ఆందోళనలు చేసింది. గుంటూరులో ర్యాలీ, కొత్తపేట ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలకు పిలుపునిచచ్చారు టీడీపీ నేతలు. టీడీపీ ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులు చెప్పారు. జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతల‌ హౌస్ అరెస్ట్‌ చేశారు పోలీసులు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి పుల్లారావు, గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, తెనాలిలో నన్నపనేని రాజకుమారి హౌస్ అరెస్ట్ అయ్యారు.

నోటీసులు ఇచ్చారు

ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ.. టీడీపీ నేతల హౌస్ అరెస్టులు బాధాకరం అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఓపిక లేకపోయినా.. పోరాడాలని పట్టుదలతో నిరసన కార్యక్రమాలకు హాజరవుతున్నాని ఆమె అన్నారు. తెల్లవారుజామున 5 గంటలకి పోలీసులు వచ్చి నోటీసులు అందజేశారు. నోటీసుల్లొ అవాస్తవాలు రాశారని మండి పడ్డారు. తనపై కేసులు ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. తెనాలిలో నాపై ఎటువంటి కేసులు లేవు అని ఆమె పేర్కొన్నారు. గుంటూరులో మహిళలతో ర్యాలీ పాల్గొనటానికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు రోజుల క్రితం మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి గుంటూరు కారం పవర్ చూపించిన ఈ ప్రభుత్వానికి బుద్దిరాలేదన్నారు. మమ్మల్ని కట్టడి చేసే కొద్ది కట్టలు తెంచుకొని ప్రవాహం ఎక్కువ అవుతూనే ఉంటుందన్నారు. ప్రపంచ దేశాల్లో నిరసనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని వైసీపీ ప్రభుత్వంపై నన్నపనేని రాజకుమారి విరుచుకు పడ్డారు.

చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్

తెలుగుదేశం పార్టీ నేతలు హౌస్‌ అరెస్టుకు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు, చంద్రబాబు, ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో రోడ్లపైకి వచ్చి సీఎం జగన్‌ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. గుంటూరులో మహిళలు భారీగా ర్యాలీ చేశారు. చంద్రబాబుకు తోడుగా మహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి పార్టీలకు అతీతంగా మహిళలు వేలాదిగా తరలివచ్చి నిరసన తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు వ్యతిరేకంగా మహిళల నినాదాలు చేశారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని మహిళల డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు