గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ? ..మరి కాసేపట్లో ట్రైలర్ రిలీజ్

గుంటూరు కారం ప్రి రిలీజ్ ఎవంట్ వాయిదా పడిన సంగతి తెల్సిందే. అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు మేకర్స్.ఈ నెల 9 న గుంటూరు లో ఈవెంట్ నిర్వహించాలని . ప్ర్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. ఫ్యాన్సే ను ఖుషి చేసేందుకు ఈ రోజే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

New Update
గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ? ..మరి కాసేపట్లో ట్రైలర్ రిలీజ్

Guntur Kaaram Pre Release event : గుంటూరు కారం మూవీకి వచ్చిన హైప్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ ఊచకోత గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదంతా ఒకెత్తు అయితే..మొన్న ప్రి రిలీజ్ ఈవెంట్ వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరాశ చెందటం మరో ఎత్తు. ముఖ్యంగా ఈ ఈవెంట్ లో థియేట్రికల్ ట్రైలర్ సైతం రిలీజ్ చేస్తారని చెప్పడంతో మహేష్ అభిమానులు మరింత నిరాశ చెందారు. ఇప్పుడు ఈ నిరాశలను పటాపంచలు చేస్తూ మేకర్స్ ఓ నిర్ణయం తీసుకున్నారు.

 9 న గుంటూరు లో ఈ ప్రీ రిలీజ్

ఎలాంటి హంగులూ ఆర్భాటాలు లేకుండా ఈరోజు సాయింత్రమే ట్రైల‌ర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ..ప్రి రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేద్దామనుకుంటే సెక్యూరిటీ సమస్యల కారణంగా పర్మిషన్స్ రావటం లేదు. ఈ నెల 9 న గుంటూరు లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని  విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు నిర్వాహకులు. రిలీజ్ కు టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా పెద్దగా చెయ్యాల్సిన పని లేదు. ఆల్రెడీ కావాల్సినంత బజ్ క్రియేట్ అయ్యింది. మహా అయితే మూవీ టీమ్ అంతా కూర్చుని గ్రూప్ ఇంటర్వ్యూ ఇస్తే సరిపోతుందని భావిస్తున్నారు. ఇక. మిగిలింది ప్రీ రిలీజ్ ఈవెంట్ . ఫ్యాన్స్ కోసం తప్పని సరిగా చెయ్యాల్సిందే.

మరి కొన్నిగంటల్లో ట్రైలర్ రిలీజ్

.సో .మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవ్వబోయే థియేట్రికల్ ట్రైలర్ పైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. ఇప్పటికే రిలీజయిన పాటలకు, టీజర్ కు అల్టిమేట్ రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ ఎలా ఉండబోతోందో అని క్యూరియాసిటి తో ఎదురుచూస్తున్నారు.

 ALSO READ :RAJAMOULI-MAHESH: మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా భామ

Advertisment
తాజా కథనాలు