Guntur Kaaram: కుర్చీని మడత పెట్టి సాంగ్ లో ఆ సంచలన హీరోయిన్‌.. సర్‌ప్రైజ్‌ ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి ..ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ శనివారం విడుదలైంది. ఇందులో త్రివిక్రమ్‌ మహేష్‌ అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఈ పాటలో నటి పూర్ణ కనిపించి మెరిసింది.

Guntur Kaaram: కుర్చీని మడత పెట్టి సాంగ్ లో ఆ సంచలన హీరోయిన్‌.. సర్‌ప్రైజ్‌ ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్!
New Update

Guntur Kaaram Song: సూపర్‌ స్టార్‌  మహేష్‌ (Mahesh Babu) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నగుంటూరు కారం సినిమాలోని '' కుర్చీని మడత పెట్టి..'' (Kurchi Madatha Petti) ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ శనివారం విడుదలైయ్యింది. ఈ సాంగ్‌ లిరిక్స్‌ అయినప్పటి నుంచి కూడా సోషల్‌ మీడియా లో ఫుల్‌ ట్రోలింగ్‌ ఎదుర్కొంటునే ఉంది. అసలు '' కుర్చీని మడత పెట్టి..''  అనే పదం పై సోషల్‌ మీడియా లో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది.

హీరో హీరోయిన్లు ప్రమోషన్స్‌ లో పాల్గొనకుండానే సినిమాకి బోలేడు ప్రచారం జరిగిపోతుంది. అసలు ఈ సాంగ్‌ ప్రొమో చూసిన వారు ఎవరైనా సరే ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయినా లేక ఐటమ్‌ సాంగ్‌ నటా అంటూ.. అనుమానాలు కూడా వస్తున్నాయి. సూపర్‌ స్టార్‌ మహేష్‌ లాంటి నటుడు తన సినిమా కోసం ఇలాంటి బూతు పదం వాడతాడని మేము అనుకోలేదంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

Also read: ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు డిస్ట్రబ్‌ చేశాడని..కన్న బిడ్డను చంపేసిన కసాయి తల్లి!

ఈ పాటను చూసిన వారు ఎవరైనా సరే ఇది సినిమాలో ఐటెం సాంగ్‌ అనే అనుకుంటున్నారనే సమాచారం. సాంగ్‌ చరణంలో కూడా మేకలు కాస్తావా..నూకలు కాస్తావా వంటి పదాలు వినిపించడంతో ఈ సాంగ్‌ ఐటెమ్ సాంగ్‌ అని అయితే ప్రేక్షకులు ఫిక్స్‌ అయ్యారు. అసలు మేటర్‌ ఏంటంటే..ఈ సినిమా శ్రీలీల గురించి కాదు అంట..ఈ పాటలో త్రివిక్రమ్‌ (Trivikram)  అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

అదేంటో తెలుసా.. ఈ పాటలో ఓ నటి కనిపిస్తుంది. ఈ పాట ఆమె కోసమే అని పాట చివర్లో కానీ ఎవరికీ తెలియలేదు. ఇంతకీ ఆ నటి ఎవరు అనుకుంటున్నారా..నటి పూర్ణా (Purnaa). కానీ సాంగ్‌ చివరి వరకు పూర్ణాని చూపించకపోవడంతో త్రివిక్రమ్‌ సర్‌ప్రైజ్‌ అదిరిందని కొందరు అంటుంటే ..మరి కొందరు మాత్రం మరో హీరోయిన్‌ ని ఎంచుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు

అయితే నటి పూర్ణా మహేష్‌ తో ఇలా పాటలో కనిపించడం ఇదేమి కొత్త కాదు. శ్రీమంతుడు సినిమాలో కూడా ''రాములోరు వచ్చారు..'' అనే సాంగ్‌ లో కూడా పూర్ణా మహేష్‌ తో ఆడిపాడింది. అయితే ఆ సాంగ్‌ పూర్ణాకి పెద్ద పేరు తీసుకుని రాలేదు. మరి ఈ సినిమా అయినా పూర్ణా ఫేట్‌ మార్చుతుందేమో చూడాలి.

#purnaa #sreeleela #trivikram-srinivas #guntur-kaaram #mahesh-babu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి