ప్రసాద్ మల్టీఫ్లెక్స్ లో గుంటూరు కారం ఒక రోజుకి 41 షోస్ తో అల్ టైం రికార్డు

గుంటూరు కారం మూవీ హైదరాబాద్ ప్రసాద్స్ మల్టీఫ్లెక్స్ లో అల్ టైం రికార్డు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా డే వన్ కే 41 షోస్ ప్రదర్శిస్తున్నట్లు మల్టీఫ్లెక్స్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. 41 షోస్ తో అల్ టైం రికార్డు నెలకొల్పిందని పోస్టర్ రిలీజ్ చేశారు.

ప్రసాద్ మల్టీఫ్లెక్స్ లో గుంటూరు కారం ఒక రోజుకి 41 షోస్ తో అల్ టైం రికార్డు
New Update

Guntur Kaaram:  సంక్రాంతి సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీగా రాబోతోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ కు ముందే రికార్డులు కొల్లగొడుతోన్న సంగతి తెలిసిందే..రీసెంట్ గా గుంటూరు లో జరిగిన ప్రీ రివీల్ ఈవెంట్ తో భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అవడంతో మహేష్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అత్యధిక ప్రీమియర్ షోస్ ప్రదర్శిస్తున్న సినిమా గా గుంటూరు కారం మూవీ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. గుంటూరు కారంతో మరో రికార్డు ఈ చిత్రం నమోదు చేసుకుంది.

ఈ షోస్ అన్నీ హౌస్ ఫుల్ అయితే మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డు

హైదరాబాద్ ప్రసాద్స్ మల్టిప్లెక్స్ లో గుంటూరు కారం ఆల్ టైం రికార్డు సెట్ చేయడం విశేషం. డే 1 కి 41 షోస్ ని ప్రదర్శిస్తున్నట్లుగా మల్టిప్లెక్స్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసారు. ధీంతొ 41 షోస్ ప్రదర్శిస్తున్న మొట్టమొదటి చిత్రంగా గుంటూరు కారం రికార్డు సెట్ చేయడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక.. ఈ షోస్ అన్నీ హౌస్ ఫుల్ అయితే మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డుగా నమోదు అవడం ఖాయం అని అంటున్నారు.

కుర్చీ మడతపెట్టి పాటకు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం
తల్లీ కొడుకుల సెంటిమెంట్ తో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న గుంటూరు కారం మూవీ లో స్రేలీల డ్యాన్సులు అదరగొట్టేసిందని , ఆమె డ్యాన్సుకు మహేష్ బాబు సైతం ఆశ్చర్యపోయినట్లు ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు చెప్పారంటే శ్రీలీల డ్యాన్సులు క్రేజ్ రేంజ్ ఏంటో తెలుస్తోంది. ఇక.. ఈ మూవీ లో కుర్చీ మడతపెట్టి పాటకు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అని ఈ వేదికపైన మహేష్ చెప్పారు. థమన్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ అని థమన్ పై ప్రశంసల జల్లు కురిపించారు మహేష్. ఈ సినిమా మహేష్ బాబుకు చాలా ప్రత్యేకమైన సినిమా అని చెప్తూ .. త్రివిక్రమ్ గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. త్రివిక్రమ్ ఫ్రెండ్ కంటే ఎక్కువని , కుటుంబసభ్యుడిలా భావిస్తానని తెలియజేసారు.

హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం

అతడు, ఖలేజా చిత్రాల తరువాత చాలా ఏళ్ల గ్యాప్ తరువాత వస్తోన్న సినిమా గుంటూరు కారం కావడంతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.ఈ మూవీలో మహేష్ తల్లిగా రమ్యకృష్ణ ఓ శక్తివంతమైన పాత్రలో అలరించబోతున్నారు. ఈ మూవీలో మరో గేస్ట్ అప్పీరియన్స్లో మీనాక్షి చౌదరీ అలరించనుంది. మొత్తానికి ఈ సంక్రాంతికి రిలీజవబోతోన్న నాలుగు చిత్రాల్లో ముందుగా జనవరి 12 న రిలీజయ్యే ఈ సినిమా హారికా & హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు.

Also Read:సైంధవ్ లో క్లైమాక్స్ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్

#mahesh-babu #trivikram #sreeleela #gunturu-karam #all-time-record #prasads-multiflex-shows
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe