Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల కలకలం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయటకు కాల్పులు కలకలం రేపాయి. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల కలకలం

Gunshots Fired Outside Salman Khans House: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయటకు కాల్పులు కలకలం రేపాయి. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం 5గంటల నుంచి తుపాకీ కాల్పులు వినిపించాయి. ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు వచ్చారని తెలుస్తోంది. ఇద్దరు బైక్ మీద వచ్చారని దూరం నుంచి చూసినవారు చెబుతున్నారు అయితే వారు ఎవరు, ఎందుకు ఇదంతా చేశారు అనే విషయాలు మాత్రం తెలియలేదు. పెక్యూరిటీ, పోలీసులు సల్మాన్ ఇంటి వద్దకు చేరుకునే సమయానికి ఇద్దరు ఆగంతకులు అక్కడ నుంచి పరారయ్యారు. ఇప్పటికే స్థానిక పోలీసులు, ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌ వారు అక్కడకు చేరుకుని క్లూల కోసం పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పరిశీలిస్తున్నారు.

బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామంటూ ఇంతకు ముందు చాలాసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది లార్సెన్స్ బిష్ణోయ్ నుంచి కూడా సల్మాన్‌కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఒకసారి లెటర్ కూడా పంపించారు. సల్మాన్ అప్పుడే దీని గురించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇవి జరిగి చాలా రోజులు అయింది.

Also Read: మహిళలు, యువతే లక్ష్యంగా బీజేపీ సంకల్ప పత్ర

Advertisment
తాజా కథనాలు