Russia: రష్యాలో ఉగ్రవాదుల ఘాతుకం...40 మంది మృతి..145 మందికి పైగా గాయాలు! రష్యా రాజధాని మాస్కోలో దారుణం జరిగింది. మిలటరీ దుస్తుల్లో ఉన్న ఐసిస్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 40మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. By Bhavana 23 Mar 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Shooting in Moscow Concert Hall: రష్యా రాజధాని మాస్కో కాల్పుల మోతతో ఒక్కాసారిగా ఉలిక్కిపడింది. శుక్రవారం సాయంత్రం నగర శివార్లలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లో కచేరి జరుగుతుండగా లోపలికి ప్రవేశించిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. దుండగులు మిలటరీ దుస్తుల్లో వచ్చి మిషన్‌గన్లతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 40మందికి పైగా చనిపోయినట్లు... 145 మందికి పైగా గాయాలైనట్లు రష్యన్ అధికార వర్గాలు వివరించాయి. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ దాడులకు ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) పాల్పడినట్లు భావిస్తున్నారు. Why would ISIS attack Russia, when Russia is the only global power that helps Islamic nations around the world? Obvious bullshit, atleast i don't buy this. 🚨Everyone knows it's not ISIS #Moscow #Russia pic.twitter.com/Mn7BOCxPGk — RanaJi🏹 (@RanaTells) March 22, 2024 శుక్రవారం సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న మాస్కో (Moscow) .. కాల్పులతో ఒక్కసారిగా యుద్ద వాతావరణంలా మారింది. ఐదుగురు దుండగులు కూడా మిలటరీ దుస్తుల్లో ఉండడంతో పాటు హాల్ వద్దకు రావడంతోనే కాల్పులు ప్రారంభించారని ఆ తర్వాత హాలులోకి వచ్చి గ్రైరేడ్లను కూడా విసిరినట్లు అధికారులు తెలిపారు. ప్రజలంతా కూడా ప్రాణ భయంతో హాల్ సమీపంలో ని బ్రిడ్జి పై పరిగెడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దుండగులు బాంబులు (Bombs) కూడా ప్రయోగించడంతో హాలు అంతా మంటలు వ్యాపించాయి. దాడులు జరిగిన వెంటనే రష్యన్ అధికార వర్గాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. కొన్ని టీమ్ లు రంగంలోకి దిగి గాయపడిన వారిని ఆసుపత్రులకు చేరుస్తున్నాయి. హాలు వద్దకు 70 అంబులెన్స్ లను పంపినట్లు అధికారులు తెలిపారు. మరో పక్క భవనంలో మంటల్లో చిక్కకున్న వారిని కాపాడేందుకు హెలికాఫ్టర్లను వినియోగిస్తున్నారు. Man saves his friend and moves him around the column .#Moscow #Russian#Russia #RussiaisATerroistState ISIS pic.twitter.com/kXDZdQAchA — Noyon⭐ (@Noyonsa47174512) March 23, 2024 ఈ దాడులకు మేమే బాధ్యులం అంటూ ఉగ్ర సంస్థ ఐసిస్ ప్రకటించింది. దాడి చేసినట్లు ఐసిస్ ఓ లేఖను విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు ఏవి కూడా లేవు. అయితే ఈ దాడులకు ఉక్రెయిన్ కు (Ukraine) ఎలాంటి సంబంధం లేదని అమెరికా తెలిపింది. దీంతో ఉక్రెయిన్ అధికారులు కూడా ఈ దాడులు గురించి స్పందించారు. రష్యా (Russia) తమపై చేస్తున్న ఆక్రమణకు, దురాగతాలకు ఈ దాడులను ఒక సాకుగా వాడుకుంటుందని ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. Also read: వేసవిలో అంజూరలను ఇలా తింటే ఎంతో మేలు! #attack #russia #isis #moscow మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి