Telangana: ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ రెడీ.. తొలి దశ అర్హులు వీరే! ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గైడ్ లైన్స్ ఖరారయ్యాయి. ఈ స్కీంను ఈ నెల 11న భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గంపాడ్లో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తొలి దశలో సొంత జాగాలు, బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్లను అర్హు లుగా గుర్తించనున్నారు. By srinivas 05 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Indiramma Indlu : తెలంగాణ(Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తుంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు(Parliament Elections) రానుండగా వీలైనంత త్వరగా తదితర కార్యక్రమాలను పూర్తి చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే 6 గ్యారంటీల్లో కీలక మైన ఇందిరమ్మ ఇండ్ల స్కీం(Indiramma Indlu Scheme) కు లక్షల సంఖ్యలో అప్లికేషన్లు రావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గైడ్ లైన్స్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన జీవోను త్వరలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. గైడ్ లైన్స్ పూర్తి.. ఈ మేరకు స్కీంను మార్చి 11న భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గంపాడ్లో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన స్కీం అమలు, లబ్ధిదారుడి ఎంపిక, దశల వారీగా ఫండ్స్ రిలీజ్, స్కీంకు అర్హత తదితర అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ ను హౌసింగ్ అధికారులు ప్రభుత్వానికి అందజేయగా సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైనల్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది కూడా చదవండి: Relationship: శృంగారం తర్వాత అలిసిపోతున్నారా? ఇలా చేస్తే స్టామినా రెట్టింపవుతుంది! సొంత జాగాలు, బిలో పావర్టీ లైన్.. ఇక ఇందిరమ్మ ఇళ్లను తొలి దశలో ప్రధానంగా సొంత జాగాలు, బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్లకు అందించననున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 70 గజాల ల్యాండ్ ఉండాలని, ఇందులో 400 ఎస్ఎఫ్ టీలో బెడ్ రూమ్, హాల్, కిచెన్ ఉండేలా ఇందిరమ్మ ఇంటిని డిజైన్ చేసేలా ప్లాన్ రెడీ చేసి ప్రభుత్వానికి అందచేశారు. అలాగే గతంలో ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూం తీసుకున్న వాళ్లు దీనికి అనర్హులని అధికారులు చెబుతున్నారు. సొంత జాగా ఉన్న వాళ్ల కు రూ.5 లక్షలను ఒక్కో దశలో రూ.1.25 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ చేయనున్నారు. ఇక ప్రజావాణిలో ఇందిరమ్మ ఇండ్ల స్కీంకు మొత్తం 82 లక్షల అప్లికేషన్లు రాగా.. గతంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ లు లబ్ది పొందినవారు 18 లక్షలు ఉన్నట్లు అధికారులు లెక్కలు వెల్లడించారు. #telangana #cm-revanth-reddy #cogress #indiramma-indlu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి