Amarnath: ప్రాణం పోయినా అమర్నాథ్‌ అవినీతికి పాల్పడడు!

రాబోయే ఎన్నికల్లో కూడా అనకాపల్లి నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పోయినా సరే అమర్నాథ్‌ అనే వ్యక్తి అవినీతికి పాల్పడడు అని భావోద్వేగంగా ప్రసంగించారు.

New Update
AP Elections 2024: ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ నుంచి బరిలోకి దిగేది వీళ్లే..!

Gudivada Amarnath: ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అధికార పార్టీ లో ఆటం బాంబు ఎవరైనా ఉన్నారు అంటే..అది గుడివాడ అమర్నాథ్‌. ఏ క్షణాన ఈ ఆటంబాబు ఎవరి మీద పేలుతుందో కనీసం ఏపీ ముఖ్యమంత్రి కూడా చెప్పలేరు. ఈ క్రమంలో ఆయన విపక్షాల చేతిలో చాలా ట్రోలింగ్స్‌ కు గురయ్యారు. అయినప్పటికీ అమర్నాథ్‌ మాత్రం తన మాటల దండయాత్ర మాత్రం ఆపరు.

ఈ క్రమంలోనే ఆయన మంగళవారం అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కూడా అనకాపల్లి (Anakapalle) నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పోయినా సరే అమర్నాథ్‌ అనే వ్యక్తి అవినీతికి పాల్పడడు అని భావోద్వేగంగా ప్రసంగించారు.

మంగళవారం అనకాపల్లిలోని స్థానిక న్యూ కాలనీ లోని రోటరీ కళ్యాణ మండపంలో సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లతో (Volunteer) ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రసంగంలో ఆయన ప్రత్యర్థి పార్టీల నేతలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. కార్యకర్తలే తన ముఖ్య బలమని..నేనేప్పుడూ కూడా కార్యకర్తలతోనే ఉంటాను. విపక్ష పార్టీల నాయకులు చెప్పే మాటలు విని తనని దూరం చేసుకోవద్దని ఆయన కార్యకర్తలకు సూచించారు.

నా మీద నమ్మకం ఉంటే కార్యకర్తలు ఎల్లప్పుడూ కూడా తన వెంట నడవాలని ఆయన కోరారు. నేను పలకరించలేదనో, పక్కన ఉన్నప్పుడు చూడలేదనో నన్ను దూరం చేసుకోవద్దు. ఎందుకంటే నా తల్లిదండ్రులకు నా మనసులో ఎలాంటి స్థానం ఉందో..కార్యకర్తలకు అలాంటి స్థానమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు కూడా ఓ విషయం చెప్పారు. ఇప్పటి వరకు నేను చేసిన పనిని చూసే నాకు ఓటు వేయాలి తప్ప..నేను పని చేయకపోతే ఓటు వేయ్యోద్దని ఆయన అన్నారు.

నేను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎప్పుడూ కూడా పదవుల గురించి పట్టించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు వారిలో వారే మాట్లాడుకొని నా దగ్గరకు వచ్చిన తరువాతే వారికి పదవులు కేటాయిస్తానని ఆయన వివరించారు. వచ్చే ఎన్నికల్లో కూడా నేను అనకాపల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని అమర్నాథ్‌ స్పష్టం చేశారు.

కార్యకర్తలు ఎల్లప్పుడూ నా వెన్నంటే ఉండి ఎన్నికల బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ క్రమంలోనే ఆయన తన పై వస్తున్న ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. నేను అవినీతికి పాల్పడినట్లు నిజంగా ఎవరైనా నిరూపించగలరా అంటూ ఓపెన్‌ ఛాలెంజ్‌ చేశారు. ప్రాణం పోయినా కూడా అమర్నాథ్‌ అనేవాడు అవినీతికి పాల్పడాడు అని వివరించారు.

నోరు ఉంది కదా అని ప్రతిపక్షాల వారు ఇష్టం వచ్చినట్లు వాగితే ఉరుకునేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. అతి త్వరలోనే అనకాపల్లికి రాబోతున్నట్లు ఆయన తెలిపారు. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా నా మీద మచ్చ పడకూడదనే..నన్ను ఎవరూ కూడా వేలు ఎత్తి చూపకూడదనే నేను కోరుకుంటానని ఆయన పేర్కొన్నారు.

Also Read: అనంతపురంలో పోలీసులమని చెప్పి..2 కోట్లు ఎత్తుకెళ్లారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు