Rules Change March 1: నేటి నుంచి మారబోయే రూల్స్ ఇవే.. తప్పక తెలుసుకోండి!

మార్చి 1 నుంచి మీ జేబు(డబ్బుల)కు సంబంధించి అనేక మార్పులు జరుగుతున్నాయి. క్రెడిట్ కార్డ్‌ రూల్స్ మారే అవకాశం కనిపిస్తోంది. అటు Paytm పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై నిషేధం అమలు ఈ నెలల్లోనే. కొత్త GST నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. పూర్తి సమాచారం ఆర్టికల్‌ చదవండి.

New Update
Rules Change March 1: నేటి నుంచి మారబోయే రూల్స్ ఇవే.. తప్పక తెలుసుకోండి!

Rules Change From March 1st: ప్రతి నెల మొదటి తేదీ వచ్చిందంటే చాలు డబ్బుకు సంబంధించిన అనేక నియమాలు మారిపోతాయి. ఇవి మీ జేబు, జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ మారిన రూల్స్‌ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మార్చి 1 నుంచి చాలా నియమాలు మారబోతున్నాయి. ఇవాళ్టి(మార్చి 1) నుంచి అమల్లోకి వచ్చే పెద్ద మార్పుల జాబితాను చూడండి.

కొత్త GST నిబంధనలు:
మార్చి 1, 2024 నుంచి GST నియమాలలో పెద్ద మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పు ప్రకారం 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఇ-ఇన్వాయిస్ లేకుండా ఇ-వే బిల్లులను జారీ చేయలేరు. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) విధానంలో, రూ. 50,000 కంటే ఎక్కువ విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పంపాలంటే ఇ-వే బిల్లు అవసరం.

బ్యాంకులకు 12 రోజులు సెలవులు..
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు మార్చి నెలలో 12 రోజులు సెలవులు ఉంటాయి. వీటిలో శని, ఆదివారాల్లో వారపు సెలవులు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం, మార్చి 11, 25 తేదీలు రెండో, నాల్గొ శనివారాలు కావడంతో బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి.

ఫాస్టాగ్:
నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ KYCని అప్‌డేట్ చేయడానికి ఫిబ్రవరి 29ని చివరి తేదీగా నిర్ణయించింది. ఫాస్టాగ్ KYC ప్రక్రియ ఈ తేదీలోపు పూర్తి కాకపోతే మీరు ఇవాళ్టి సమస్యలను ఎదుర్కోవచ్చు.

క్రెడిట్ కార్డ్‌ రూల్స్:
క్రెడిట్ కార్డులకు సంబంధించిన రూల్స్ మారనున్నాయి. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన క్రెడిట్ కార్డుల నిబంధనలను మార్చాలని నిర్ణయించింది. బ్యాంకు ఈ-మెయిల్ ద్వారా ఖాతాదారులకు సమాచారాన్ని అందిస్తుంది.

Paytm పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై నిషేధం:
RBI మార్గదర్శకాల ప్రకారం Paytm పేమెంట్స్ బ్యాంక్ సేవలు మార్చి 15 నుంచి నిషేధిస్తారు. మార్చి 15 తర్వాత చోటుచేసుకుంటున్న ప్రధాన మార్పుల్లో ఇదీ ఒకటి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 29 నుంచి కొత్త కస్టమర్‌లను యాడ్ చేయడాన్ని నిలిపివేయాలని Paytm పేమెంట్స్ బ్యాంక్‌ని ఆదేశించింది. అయితే తర్వాత ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించారు. Paytm దేశంలోని అతిపెద్ద చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి.

Also Read: బంగారం మరింత కిందికి.. కొనాలంటే సూపర్ ఛాన్స్..

Advertisment
Advertisment
తాజా కథనాలు