యూపీలోని రూర్కీ రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికుడు రైలుకి, పట్టాల కు మధ్య ఇరుక్కుపోవడాన్ని గమనించిన లేడీ కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి కాపాడింది. ప్రస్తుతం దీనికి సంబంధంచిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన రూర్కీలోని లక్సర్ స్టేషన్‌లో జరిగింది. ఈ స్టేషన్‌లో జమ్మూ నుంచి సీల్దా వెళ్లే రైలు ప్లాట్‌ఫాంపై ఆగింది.
ఈ క్రమంలోనే ఆగి ఉన్న రైలులో నుంచి ఒక ప్రయాణికుడు ఆహారం, పానీయాలు కొనడానికి స్టేషన్‌లో దిగాడు. వాటిని తీసుకుని వస్తుండగా రైలు కదలడం చూశాడు. దానిని చూసిన ప్రయాణికుడు రైలు పట్టుకోవడానికి పరిగెత్తాడు. ఈ సమయంలో రైలు ఎక్కిన వెంటనే కాలు జారి రైలు కింద పడిపోయాడు. ఈ సమయంలో ప్రయాణికుడు తన తెలివితో ట్రాక్ గోడ పట్టుకుని నిలబడ్డాడు.
ఇంతలో ప్రయాణికుడి అరుపులు విన్న వెంటనే అక్కడే విధుల్లో ఉన్న జీఆర్పీ లేడీ కానిస్టేబుల్ ఉమ ప్రయాణికుడి వద్దకు పరిగెత్తింది. కానిస్టేబుల్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణీకుడి రెండు చేతులు పట్టుకుంది. ఘటనను చూసిన మరికొందరు కూడా అక్కడికి చేరుకున్నారు. రైల్వేకు దీని గురించి సమాచారం అందిన వెంటనే.. రైలు కొంత దూరంలో ఆగిపోయింది. ఆ తర్వాత ఆమె ప్రయాణికుడిని ట్రాక్ నుండి సురక్షితంగా లాగింది. తర్వాత ఆ ప్రయాణికుడిని రైల్వే చికిత్సా కేంద్రానికి తీసుకుని వెళ్లి చికిత్స అందించారు.
Also read: ఆరేళ్ల పాటు మోదీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి!