TSPSC: మరో వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇప్పటి వరకు పూర్తైన రాత పరీక్షల ఫలితాలు విడుదల చేసి.. ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలనూ మళ్లీ నిర్వహించేందుకు రెడీ అవుతోంది టీఎస్పీఎస్సీ. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు రానున్నట్లు తెలుస్తోంది.

New Update
TSPSC Group 1: తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రద్దు!

Group 4 Results : తెలంగాణ(Telangana) లో టీఎస్‌పీఎస్సీ(TSPSC) పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలనూ మళ్లీ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు(Group 4 Results) ఇచ్చేందుకు కసరత్తులు చేస్తోంది.

త్వరలోనే కీలక నిర్ణయం

కొత్త ప్రభుత్వం వచ్చాక గత నెలలో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ​జనార్దన్ రెడ్డి(Janardhan Reddy) తో పాటు మరికొందరు సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వాటిని గవర్నర్ తమిళిసై ఆమోదించిన రెండ్రోజుల తర్వాత కొత్త కమిషన్‌కు నోటిఫికేషన్ వచ్చింది. అనంతరం ఈ నెల 26న కొత్త ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సభ్యులుగా యాదయ్య, పాల్వాయి రజినీ, అనితా రాజేంద్ర బాధ్యతలు చేపట్టారు. దీంతో అప్పటినుంచి ప్రతిరోజూ సమీక్షలు, సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. గత కమిషన్ ఇచ్చిన నోటికేషన్లు ఎన్ని? ఇప్పటివరకు ఎన్ని పరీక్షలు పూర్తయ్యాయి..? ఏ పరీక్ష ఫలితాలు వచ్చాయి ? ఏయే నోటిఫికేషన్లు కోర్టు కేసుల్లో ఉన్నాయనే వివరాలపై ఛైర్మన్ మహేందర్ రెడ్డి కమిషనన్ అధికారులతో చర్చించారు. దీంతో త్వరలోనే పలు పరీక్షల ఫలితాలు, పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే కమిషన్‌ తొలి భేటీని నిర్వహించనున్నరు.

గ్రూప్ 1 ఖాళీలున్ని
గ్రూప్ 1 నోటిఫికేషన్(Group 1 Notification)  503 పోస్టులతో రిలీజ్ చేసి సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 3.80 లక్షల మంది అప్లై చేశారు. అయితే, రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్షలు జరగగా.. మొదటిసారి పేపర్ లీక్, రెండోసారి పరీక్షను సక్రమంగా నిర్వహించలేదనే కారణంతో హైకోర్టు రద్దు చేసింది. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో టీఎస్పీఎస్సీ కేసు వేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో కేసు వెనక్కి తీసుకునే అవకాశాలున్నాయి. ఇదిలాఉండగా.. ఈ నెల 31లోగా గ్రూప్ 1 పోస్టుల ఖాళీల వివరాలను ఇవ్వాలని ఇటీవలే ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు అన్ని డిపార్ట్‌మెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుందనే నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

Also Read : ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్‌!

ప్రతి అభ్యర్థికీ ర్యాంక్ కేటాయింపు
ఇక రాష్ట్రంలో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ.. గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వగా, జులై1న పరీక్ష నిర్వహించారు. 9,51,205 మంది అప్లై చేయగా 7,62,872 మంది పేపర్ 1 రాశారు. అలాగే 7,61,198 మంది పేపర్ 2 పరీక్ష రాశారు. 5 నెలల కిందే ఫైనల్ కీ విడుదలైంది. కానీ ఇంతవరకు ఫలితాలు రాలేవు. ఇప్పటికే రిజల్ట్ ప్రక్రియ అంతా పూర్తయి రెడీగా ఉండటంతో, త్వరలోనే ఫలితాలను ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ముందుగా జనరల్ ర్యాంకు లిస్టును (జీఆర్ఎల్) ప్రకటించనున్నారు. అంతేకాదు పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి కూడా ఓ ర్యాంకును కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్లవారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నా రు. అయితే ఈ నోటిఫికేషన్‌‌‌‌లో దాదాపు 99 శాఖల పోస్టులన్నాయి. అందులో మెజార్టీ పోస్టులు జిల్లాస్థాయిలో, కొన్ని జోనల్‌‌‌‌ స్థాయిలో ఉన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు