TG JOBS: గ్రూప్-1 మెయిన్స్‌ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నెలకు ఐదు వేల స్టైఫండ్!

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నెలకు రూ.5 వేల స్టైఫండ్‌తో 75 రోజులపాటు ఉచిత‌ శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు జులై 19 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. వార్షిక ఆదాయం రూ.5 ల‌క్షల లోపు ఉండాలి.

TG JOBS: గ్రూప్-1 మెయిన్స్‌ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నెలకు ఐదు వేల స్టైఫండ్!
New Update

TGPSC Group 1: గ్రూప్-1 మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నెలకు రూ. 5 వేల స్టైఫండ్ (Stipend) తోపాటు ఉచిత‌ శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (TSBCESDTC) డైరెక్టర్ శ్రీ‌నివాస్ రెడ్డి జులై 9న అధికారిక ప్రకటన విడుదల చేశారు.

రోల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక..
ఈ మేరకు మెయిన్స్ కు ఎంపికైనవారికి 75 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రోల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ ప్రకారం ఉచిత శిక్షణ‌కు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణకు ద‌ర‌ఖాస్తు చేసే అభ్యర్థుల త‌ల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 ల‌క్షల లోపు ఉండాలి. అర్హులైన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు జులై 10 నుంచి 19 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్‌తో కింద రూ.5,000 ఇస్తారు. బుక్‌ఫండ్‌, ట్రాన్స్‌పొర్టేషన్ ఖర్చులను ఇందులోనే ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం సీట్లలో 75 శాతం బీసీలకు, 15 శాతం ఎస్సీలకు, 5 శాతం ఎస్టీలకు, ఈబీసీ& దివ్యాంగులకు 5 శాతం సీట్లను కేటాయించనున్నారు.

ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు హైద‌రాబాద్ సైదాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ స‌ర్కిల్ (రోడ్ నెం: 8, ల‌క్ష్మీన‌గ‌ర్‌), ఖ‌మ్మంలోని టీజీ బీసీ స్టడీ స‌ర్కిల్‌లో 75 రోజులపాటు తరగతులు నిర్వహిస్తారు. అభ్యర్థులు కుటుంబ ఆదాయ ధ్రువపత్రంతోపాటు, అవసరమైన అన్ని సర్టిఫికేట్లను తీసుకురావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఫోన్: 040- 24071178 లేదా 040-29303130 నెంబర్లను సంప్రదించాలని సంబంధింతి అధికారులు సూచించారు.
వెబ్ సైట్ లింక్ ఇదే: https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce

#telangana #tspsc-group-1 #bc-study-circle
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe