వరుడి మెడలో కరెన్సీ నోట్ల దండ.. విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

పూల దండలకు బదులు కరెన్సీ నోట్ల దండతో దర్శనమిచ్చి ఓ పెళ్లికుమారుడు అందరినీ ఆశ్చర్యపరిచాడు. హర్యానాలో ఖురేషిపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకోగా రూ.20 లక్షల విలువైన రూ.500 నోట్లను ఈ మాల తయారీలో వినియోగించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

New Update
వరుడి మెడలో కరెన్సీ నోట్ల దండ.. విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

సోషల్ మీడియా పుణ్యమా అని ఈ తరం యువకులు అడ్డగోలు ప్రయోగాలు చేస్తున్నారు. వేదికతో సబంధం లేకుండా వార్తల్లో నిలిచేందుకు డిఫరెంట్ స్టైల్స్ తో అట్రాక్ట్ చేస్తున్నారు. ఇలాంటిదే ఓ వరుడు చేసిన ఫన్నీ ఇన్సిండెంట్ నెటిజన్లను అశ్చర్యానికి గురిచేస్తుంది. పెళ్లి కొడుకు తమ కల్చర్ కు భిన్నంగా సరికొత్త అవతారంలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పూల దండలకు బదులు మెడలో కరెన్సీ నోట్లతో తయారు చేసిన మాలను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. హర్యానాలో ఖురేషిపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ సరికొత్త ట్రెండ్ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Also read  : అమెరికాలో దారుణం.. భారతీయ విద్యార్థిని కాల్సి చంపిన దుండగులు

ఈ మేరకు హర్యానాలో ఖురేషిపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుంకుంది. పెళ్లి కుమారుడు మెడలో పూల దండలకు బదులు కరెన్సీ నోట్లతో తయారు చేసిన అతి పెద్ద దండను మెడలో ధరించాడు. దాదాపు రూ.20 లక్షల విలువైన రూ.500 నోట్లను ఈ దండ తయారీలో వినియోగించినట్లు తెలుస్తున్నది. ఇక ఈ అవతారంలో అందరినీ అట్రాక్ట్ చేసేందుకు తన ఇంటి మేడ మీద గోడపై నిల్చొని ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ దండా దాబాపైనుంచి నేలమీదకు తాకేంత పొడవు ఉండట విశేషం. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసి స్థానికులతోపాటు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నోట్ల దండతో ఫోజు ఇచ్చిన ఆ వరుడి రిచ్‌నెస్ చూసి కొందరు షాక్‌ అవుతున్నారు. కరెన్సీ నోట్లను ఇలా ప్రదర్శించడం అవసరమా అని మరికొందరు ప్రశ్నించారు. ఆ దండలోని నోట్లు నకిలీ కావచ్చని ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. దీని గురించి ఐటీ శాఖకు సమాచారం ఇవ్వాలని మరొకరు వ్యాఖ్యానించారు. అయితే ఇంత పెద్ద కరెన్సీ దండ వేసుకుని ఆ వరుడు ఎలా నడుస్తాడంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియా పుణ్యమా అని ఏదో ఒక స్టంట్ తో వార్తల్లో నిలిచేందుకు యువకులు తెగ ప్రయోగాలు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు