China Floods : చైనా (China) లో వాతావరణ పరిస్థితులు చాలా డైనమిక్‌గా మారిపోతున్నాయి. గత నెలలో వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అయిన చైనా ఇప్పుడు వరద (Floods) ల్లో మునిగి తేలుతోంది. జూలై అంతా ఎండవేడి తట్టుకోలేక అక్కడి ప్రజలు విలవిలలాడారు. 1961 మళ్ళీ ఇప్పుడూ అంతటి వేడిని చూశారు. అయితే అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జులై చివరికి వచ్చేసరికి పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి. అటు సౌత్ చైనా ప్రాంతాలను వరదలు పోటేత్తాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. జిక్సింగ్ ప్రాంతంలోని టౌన్‌షిప్‌లను కలిపే రోడ్లను మూసేశారు. విద్యుత్ కూడా ఆగిపోయింది.
దీనంతటికీ ఒక్కటే కారణం అంటున్నారు అక్కడి వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు. ప్రపంచంలోనే అత్యధికంగా గ్రీన్ హౌస్ వాయువులను (Green House Carbon) విడుదల చేసే దేశం చైనా. ఇదే ఆ దేశంలో విపరీత వాతావరణ పరిస్థితులకు కారణం అవుతోందని చెబుతున్నారు. గ్రీన్ హౌస్ వాయువుల వలన వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఒక రోజు ఎండ కాల్చేస్తుంటే... మరొక రోజు వర్షం పడుతోంది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో భానుడు 40 డిగ్రీలు సెంటిగ్రేడ్ దాటి నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. షాంఘైలో 40డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరోవైపు వర్షాలతో (Rains) అతలాకుతలం అవుతోంది. ఇక ప్రపంచంలో వరదల వల్ల నష్టపోతున్న దేశాల్లో చైనా రెండవ స్థానంలో ఉంది. మొదటి ప్లేస్‌లో ఇండియా ఉంది.
Also Read:USA: సెప్టెంబర్‌లో కమలా హారిస్, ట్రంప్ మధ్య డిబేట్