Anshuman Gaikwad: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ నిన్న రాత్రి మరణించారు. గత కొంత కాలంగా ఆయన బ్లడ్ కాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 71 ఏళ్ళు. గైక్వాడ్ 1974-87 మధ్య భారత జట్టు తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. కెరీర్ మొత్తంలో 2254 పరుగులు చేశారు. వాటిలో రెండు శతకాలు ఉన్నాయి. 1983లో జలంధర్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 201 పరుగులు చేశాడు. దీంతో పాటూ ఆయన టీమ్‌ఇండియాకు రెండుసార్లు ప్రధాన కోచ్‌గా పనిచేశారు. 1997-99 మధ్య కాలంలో ఒకసారి కోచ్‌గా పనిచేశారు. తరువాత కూడా ఆయనను కోచ్‌గా కొనసాగించారు. అన్షుమన్ కోచ్‌గా ఉన్న సమయంలోనే 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. 1990ల్లో జాతీయ టీమ్ సెలెక్టర్‌గా, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగానూ పనిచేశారు.
టీమ్ ఇండియాకు ఇన్ని సేవలు చేసిన అన్షుమన్ గైక్వాడ్ చాలా రోజులుగా ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్నారు. తనకు వచ్చిన క్యాన్సర్ ట్రీట్ మెంట్‌కు కూడా అతని దగ్గర డబ్బులు లేవు. ఈయన ఆరోగ్యం గురించి, ఆర్థిక పిస్థితుల గురించి భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బీసీసీఐకు విజ్ఞప్తి కూడా చేశారు. దీనికి స్పందించిన బీసీసీఐ వెంటనే ఆర్థిక సహాయం కూడా చేయడానికి ముందుకు వచ్చిందికూడా. అయితే ఇంతలోనే ఆయన కన్నుమూశారు. అన్షుమన్ మృతికి ప్రధాని మోదీ సంతాపాన్ని తెలియజేశారు. క్రికెట్‌కు గైక్వాడ్ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, తను మరణించారన్న వార్త బాధ కలిగించిందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మోదీ సానూభూతి వ్యక్తం చేశారు. బీసీసీఐ కార్యదర్శి జైషాతో, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీతో పాటు పలువురు క్రికెటర్లు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
Also Read:Kerala: వయనాడ్‌లో మృత్యుఘోష.. 254కు చేరిన మృతుల సంఖ్య