IAS Aravind Kumar : ఐఏఎస్ అధికారి అరవింద్‌ కుమార్‌కు ప్రభుత్వం మెమో

హెచ్ఎండీఏ మాజీ కమిషనర్, విపత్తుల నివారణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. కేబినెట్ అనుమతి లేకుండా ఫార్ములా రేసింగ్ కోసం 50 కోట్లు ఎలా మంజూరు చేశారో చెప్పాలని ప్రభుత్వం వివరణ కోరినట్టు తెలుస్తోంది.

IAS Aravind Kumar : ఐఏఎస్ అధికారి అరవింద్‌ కుమార్‌కు ప్రభుత్వం మెమో
New Update

Telangana Government : ఐఏఎస్(IAS) అధికారి అరవింద్‌ కుమార్(Aravind Kumar) చిక్కుల్లో పడ్డారు. హెచ్ఎండీఏ మాజీ కమీషనర్, విపత్తుల నివారణ ప్రధాన కార్యదర్శి అయిన అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మెమో(Memo) జారీ చేసింది. హెచ్ఎండీఏ(HMDA) కమిసనర్‌గా ఉన్నప్పుడు కేబినెట్ అనుమతి లేకుండా ఫార్ములా రేసింగ్(Formula Racing) కోసం 50 కోట్లు చెల్లించడం మీద ప్రభుత్వం వివరణ కోరినట్టు సమాచారం. ఏ హోదాలో కేబినెట్ అనుమతి లేకుండా ఆ సంస్థతో సంతకాలు ఎలా చేశారో చెప్పాలని అడిగింది. అది కాకుండా ఫార్ములా ఈ ఆపరేషన్స్‌లో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయని కూడా ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Also read:ఆరు గ్యారెంటీల అమలుకు ఇంటింటి సర్వే-మంత్రి పొంగులేటి

ఫార్ములా ఈ రేసింగ్ కోసం ఆ సంస్థతో హెచ్ఎండీఏ అనుమతి కూడా తీసుకోలేదని ప్రభుత్వం అంటోంది. దాని కోసం పెట్టిన 50 కోట్లు ఏ విధంగా ఖర్చు పెట్టారో కూడా లెక్కలు చెప్పాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అరవింద్ కుమార్ ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా ఇవ్వలేదు.  ఎంత ప్రయత్నించినా  ఆయన అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు.

publive-image  publive-image

ఫార్ములా ఈ రేస్ రద్దు..

మరోవైపు ఫిబ్రవర్ 10న హైదరాబాద్‌లో(Hyderabad) జరగాల్సిన ఫార్ములా ఈ రేస్‌ను రద్దు చేస్తున్నామని ఫార్ములా ఈ రేస్(Formula E Race) ఆపరేషన్స్ ఇప్పటికే ప్రకటించింది. ఈ-రేస్ సీజన్ 10కు చెందిన నాలగవ రౌండ్ ఇక్కడ జరగాల్సి ఉంది. అయితే ఈ రేస్ గురించి తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) స్పందిచలేదని…దానికి తోడు మున్సిప‌ల్ శాఖ‌(GHMC), హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిన‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 30వ తేదీ జ‌ర‌గిన ఒప్పందాన్ని మున్సిప‌ల్ శాఖ ఉల్లంఘించిన‌ట్లు ఒక ప్రక‌ట‌న‌లో పేర్కొన్నారు. దాంతో పాటూ మున్సిపల్ శాఖకు నోటీసులు కూడా జారీ చేశామని చెబుతున్నారు. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్ఈవో చెబుతోంది.

గ‌త తెలంగాణ స‌ర్కార్‌, ఫార్ములా ఈ మ‌ధ్య ఈ రేస్ ఒప్పందం జ‌రిగింది. కానీ ప్రస్తుతం తెలంగాణ స‌ర్కార్ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది. సీజ‌న్ 10 రేస్‌లు జ‌ర‌గ‌నున్న న‌గ‌రాల్లో టోక్యో, షాంఘై, బెర్లిన్‌, మొనాకో, లండ‌న్ న‌గ‌రాలు ఉన్నాయి. జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి ఈ సీజ‌న్ ప్రారంభంకానుంది. తెలంగాణలో ఫార్ములా రేస్ కాన్సిల్ అవడం చాలా నిరాశపరిచిందని అంటున్నారు ఫార్ములా ఈ ఛీఫ్ ఆఫీసర్ అల్బర్టో లాంగో. ఈ రేస్ నిర్వించడం వలన హైదరాబాద్‌కు చాలా కీకలమైనది అని ఆయన వ్యాఖ్యానించారు. మోటార్ స్పోర్ట్స్ అభిమానులకు ఇది పెద్ద డిసప్పాయింట్ అని అన్నారు.

#telanagna #formula-e-race #government #ias-aravind-kumar #memo
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe