Tamilisai: కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ సీరియస్
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు వెయ్యకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానన్న పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆదేశం జారీ చేశారు.
Tamilisai serious on Kaushik Reddy: హుజూరాబాద్ (Huzurabad) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆదేశాం జారీ చేశారు. జేఎన్టీయూలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections 2023) హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల్లో పత్యర్థి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajender) పై ఆయన విజయం సాధించారు. అయితే, ఎన్నికల ప్రచారం చివరి దశలో ఉన్నప్పుడు తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు. తాజగా కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) ఎన్నికల ప్రచారంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి గెలవాలని కానీ, ఇలాంటి వ్యాఖ్యలు చేసి బెదిరించి ఓట్లు అడగడం సరికాదని గవర్నర్ తమిళిసై కామెంట్స్ చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి గవర్నర్ సూచించారు.
అయితే, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఆ సమయంలోనే ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ కూడా సుమోటోగా కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. పూర్తిస్థాయిలో ఆయనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. తాజాగా తమిళి (Tamilisai Soundararajan) మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి సూచించారు. తెలంగాణ సీఈవో (Telangana CEO) వికాస్ రాజ్ కూడా అదే కార్యక్రమంలో ఉండటంతో కౌశిక్ రెడ్డిపై ఈసీ చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.

Also Read: కళ్యాణ్ కన్నింగ్ ప్లాన్.. కావ్యను చీరతో కట్టి రాజ్ ఏం చేశాడంటే?
ఈ ఎన్నికల్లో పత్యర్థి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajender) పై ఆయన విజయం సాధించారు. అయితే, ఎన్నికల ప్రచారం చివరి దశలో ఉన్నప్పుడు తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు. తాజగా కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) ఎన్నికల ప్రచారంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి గెలవాలని కానీ, ఇలాంటి వ్యాఖ్యలు చేసి బెదిరించి ఓట్లు అడగడం సరికాదని గవర్నర్ తమిళిసై కామెంట్స్ చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి గవర్నర్ సూచించారు.
Also Read: దేవర మూవీ రిలీజ్ వాయిదాలో నిజమెంత?