Government reading your WhatsApp chats?: మెటా(meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్(whatsapp)కి ప్రపంచవ్యాప్తంగా భారీగా వినియోగదారులున్నారు. మన దేశంలో ఆ సంఖ్య చాలా చాలా ఎక్కువే.. వాట్సాప్ లేకపోతే పనులే జరగని పరిస్థితులున్నాయి. ఆఫీస్ వర్క్ కూడా చాలా వరకు వాట్సాప్ నుంచే రన్ అవుతుంటుంది. ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో వాట్సాప్ భాగమైపోయింది. సంకేతిక అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో హ్యాకర్లు, మోసగాళ్లు కూడా పెరిగిపోయారు. ఇక ప్రతి ఒక్కరూ తమ లైఫ్‌లో ప్రైవసీని కోరుకుంటారు. అందుకే స్మార్ట్ ఫోన్‌లలో కూడా దాదాపు ప్రతి యాప్‌కి కూడా ప్రైవసీ లాక్(privacy lock) పెట్టుకునే వాళ్లుంటారు. ఒకవేళ వాళ్లు పెట్టుకున్నా.. పెట్టుకోకున్నా.. అవతలి వారి మెసేజులు చదవడం కరెక్ట్ కాదు. అందుకే వాట్సాప్ కూడా చాట్స్‌కి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మెసేజులు కేవలం ఇద్దరి మధ్య మాత్రమే ఉండేలా డిజైన్ చేసింది. అయితే ఇటివలి కాలంలో ఓ న్యూస్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటా న్యూస్?
మన చాట్స్‌ని ప్రభుత్వం చదువుతుందా(Government reading your WhatsApp chats)?
సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ట్విట్టర్ (twitter), ఫేస్‌బుక్‌లలో ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌లో వ్యక్తిగత చాటింగులను చదువుతుందని ఆ మెసేజ్ సారాంశం. మనం మెసేజ్ పంపిన తర్వాత మూడు బ్లూ టిక్‌లు కనిపిస్తే ప్రభుత్వం ఆ చాట్‌ని గమనించిందని, రెండు బ్లూ, ఒక రెడ్ టిక్ కనిపిస్తే ప్రభుత్వం వారిపై చర్య తీసుకోవచ్చని సూచించినట్టని.. ఇంకా ఒక బ్లూ,రెండు రెడ్ టిక్‌ల కనిపిస్తే పంపినవారి డేటాను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు భావించవచ్చట. చివరగా.. ప్రభుత్వం సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలను ప్రారంభించినప్పుడు మూడు రెడ్ టిక్‌లు కనిపిస్తాయట.. అసలు ఇందులో నిజమెంతా?
అంతా ట్రాష్:
అసలు వాట్సాప్‌లో మెసేజ్ పంపిన తర్వాత రెడ్ టిక్‌లను ఉపయోగించదు. మన చాటింగ్‌లను ప్రభుత్వం చదువుతుందన్న వార్త పూర్తిగా అవాస్తవం. వాట్సాప్ లేదా మరే ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రైవేట్ సందేశాలను పర్యవేక్షించబోమని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. PIB ఫాక్ట్ చెక్(fact check) కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. యూజర్ల మధ్య గందరగోళాన్ని సృష్టించడానికి ఎవరో కావాలనే ఈ ఫేక్ మెసేజ్‌ని సర్క్యూలేట్ చేస్తున్నారు. మీకు ఇలాంటి మెసేజ్ వస్తే అసలు నమ్మవద్దు. వాట్సాప్ ఫార్వర్డ్స్‌లో కూడా వాట్సాప్ గురించే ఫేక్ మెసేజులు(fake messanges) వస్తుంటాయి. ఇలాంటివి గతంలో కూడా వచ్చాయి.. వీటిలో ఏది నిజం కాదు.. మీ చాటింగ్ ఎండ్-టు-ఎండ్‌లోనే ఉంటుంది. మీ మెసేజులను ప్రభ్వుతం చదవదు.
Also Read: ఐటీఆర్ ఫైలింగ్ మిస్ అయ్యారా? బాధపడొద్దు..ఇలా చేయండి..!!